ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై రోజుకో వార్త వెలుగులోకి వస్తున్న క్రమంలో తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక దిగ్భ్రాంతికరమైన ఒక వార్తాకథనం ప్రచురించింది. ఈ వార్తా కథనం వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పుడు రేప్ చేసిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయట. పోర్న్ పాతబడిపోయింది.. రియల్ లైఫ్ నేరాలకు గిరాకీ పెరిగిందని ఒక దుకాణదారుడు చెబుతున్న్నాడంటే.. మనిషి ఆలోచనలు రోజు రోజుకీ ఎంత వికృతంగా తయారవుతున్నాయో ఈ సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఒక అమ్మాయిని రేప్ చేయడం ఆ రేప్ ని వీడియో తీయడం వాటిని సీడీలు చేసి - పెన్ డ్రైవ్ లేదా మొబైల్ ఫోన్ లోకి నేరుగా పంపించి అమ్ముతున్నారట. ప్రతీ రోజూ వందల - వేల సంఖ్యలో ఈ వీడియోల అమ్మకాలు కొనసాగుతున్నాయంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతుంది.
30 సెకండ్ల నుంచి 5 నిముషాలవరకు ఉండే వీడియో క్లిప్ లను రూ. 50 - రూ. 150 వరకు అమ్ముతున్నట్టు ఈ పత్రిక పేర్కొంది. వీటిని వ్యాపారస్తులకు - డీలర్లకు అత్యాచారం చేసిన వ్యక్తులే స్వయంగా అమ్ముతున్నారని కూడా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటైన కొన్ని గ్యాంగులు ట్విట్టర్ / ఫేస్ బుక్ ఖాతాలనుంచి వివరాలు సేకరించి వారికి అమ్ముతారట. బెలాగంజ్ - కమలనగర్ - బలేశ్వర్ వంటి ప్రాంతాల్లో ఈ వీడియోలు పుష్కలంగా దొరుకుతున్నాయట. ఇదే సమయంలో మరికొన్ని దారుణమైన విషయాలు వెల్లడించింది ఈ కథనం.
ఈ వీడియోలు స్నేహితుల ద్వారా కానీ, నేరుగా తనకే పంపడం వల్లకానీ, ఆన్ లైన్ ద్వారా కానీ తెలుసుకున్న యువతులు అవమానభారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. ఈమధ్య ఆన్ లైన్ లో తన వీడియోను చూసి షాకైన 21ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజా ఉదాహరణ. దీనికి కొనసాగింపుగా ఒక నిందితుడైతే.. రేప్ చేసిన అమ్మాయినే న్యూడ్ గా ఫోటోలు తీసి ఆ ఫోటో ప్రింటును రూ. 3 చొప్పున అమ్ముతున్నాడట. ఈ స్థాయిలో అక్కడ విచ్చలవిడితనం - దుర్మార్గం పెరిగిపోయాయి. మరో షాకింగ్ విషయం ఏమిటంటే... స్థానిక పోలీసులకు - పాలనా యంత్రాంగానికి తెలిసే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ పత్రిక పేర్కొంది.