తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో నిజాయితీగా పని చేసిన కొందరు ఉద్యమకారుల్లో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవులకు దూరంగా ఉన్న ఆయన.. తెలంగాణ ప్రయోజనాలకు తప్పించి మరేవి తనకు ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరించారు. అధికారపక్షానికి దూరంగా ఉన్న కోదండరాం తీరుతో కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారని చెబుతారు.
ఈ రోజుకి తెలంగాణ ఉద్యమ నేతల్లో ప్రజాదరణ.. విశ్వసనీయత ఉన్న ఉద్యమకారుల్లో కోదండరాం ముందుంటారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ముఖ్యనేతల్లో వ్యక్తిగతంగా లాభం కాకుండా నష్టానికి గురైన ఉద్యమకారుల్లోనూ కోదండరాం పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.
ఉద్యమం కోసం కోదండరాం తనకున్న వ్యవసాయ భూమిని కొంతమేర అమ్మేశారన్న మాటను ఆయన సన్నిహితులు కొందరు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు చెక్ పెట్టే సత్తా.. ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న వ్యక్తి కోదండరాం అని నమ్మేవారు చాలామందే కనిపిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధీటుగా ఢీ అనే సత్తా కోదండం మాష్టారికి ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అందుకే.. రాబోయే రోజుల్లో అధికారపక్షానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను తయారు చేసే సత్తా ఉన్న నాయకుల్లో కోదండరాం పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.
తనకు రాజకీయ పార్టీ పెట్టటం ఇష్టం లేదని చెప్పే కోదండం మాష్టారి నోటి నుంచి తాజాగా ఆసక్తికరమైన మాట ఒకటి వచ్చింది. తనను రాజకీయపార్టీ పెట్టాలన్న ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని ఆయన ఒప్పుకున్నారు. కొత్త పార్టీ పెట్టాలని ప్రజల నుంచి వివిధ సంఘాల నుంచి ప్రెజర్ వస్తుందన్నారు. ఐదో దశ అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఈ నెల 9 నుంచి 12 వరకు అదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్నట్లు ఆయన చెబుతున్నారు. మొన్నటి దాకా పార్టీ ఊసే లేదన్న కోదండం మాష్టారి నోటి నుంచి పార్టీ పెట్టాలన్న డిమాండ్ వస్తుందన్న మాట రావటం అంటే.. ఆ దిశగా అడుగులు పడనున్నాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.