బీజేపీ పాలనలో దేనికి నియంత్రణ లేకుండా పోతోంది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ ధర కొండెక్కి కూర్చుంది. నిత్యావసరాలు మండిపోతున్నాయి. తాజాగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థనే కృంగదీస్తోంది. అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. ఈ పతనం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా డాలర్ కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ రూపాయి భారీగా క్షీణిస్తోంది. మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా రూ.74 మార్క్ ను దాటడం సంచలనమైంది. డాలర్ తో రుపాయి మారకం విలువ గురువారం ఏకంగా 73.32 వద్ద క్లోజ్ అయ్యింది. ఈరోజు ఉదయం మరింత నష్టపోయి 74కు పడిపోయింది. ఇదే భారీ పతనంగా చెబుతున్నారు. గత అక్టోబర్ 2018లో రూపాయి తొలిసారి అమెరికా డాలర్ తో భారీగా పతనమైంది. కరోనా వైరస్ కారణంగా తాజాగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయి తాజాగా 74కు పడిపోయింది. మొదట 73.90 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన రూపాయి కాసేపటికే ఏకంగా రూ.74.04 వద్దకు పడిపోయింది. 30 అక్టోబర్ 2018నాటికి దిగజారింది.