రాజకీయాలలో నిలవాలి అంటే ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలి .. ప్రత్యర్థులు ఒక ప్లాన్ ఆలోచించే లోపే ఆ ప్లాన్ అమలు చేసి చూపించాలి. అలా అయితేనే ప్రస్తుత రాజ్కియాలలో నెట్టుకురాగలరు. ఆలా కాకుండా జరిగేది జరుగుతుందిలే అని అనుకుంటే మాత్రం .. ఆ తరువాత పరిణామాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. రాజకీయాల లో వ్యూహాలకి దిట్ట జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవగౌడ్. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన రెండో వ్యక్తి. తనకున్న రాజకీయ చతురతతో అతి తక్కువ ఎంపీ సీట్లతో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
ఇక ప్రస్తుత కర్ణాటక రాజకీయ పరిస్థితులని ఒకసారి పరిశీలిస్తే .. కర్ణాటకలో ఎప్పుడు రాజకీయ సందిగ్దత నెలకొనే ఉంటుంది. దీనికి కారణం అక్కడ ఉన్న నేతలే. ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ అధికారం చేపడితే .. ఆ తరువాత వ్యూహాత్మకంగా జేడీఎస్ తో జోడి కట్టిన కాంగ్రెస్ బీజేపీ ని గద్దె దించారు. ఆ తరువాత బీజేపీ క్యాంప్ రాజకీయాలకి తెరతీసి మళ్ళీ అధికారం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ కొంతమంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేసింది. దీనిపై ఎమ్మెల్యే లు కోర్టుకి వెళ్లగా .. ఈ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. అలాగే త్వరలోనే కర్ణాటకలో 15 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో మళ్ళీ కథ ఎటువైపు తిరుగుతుందో అని సీఎం యడ్డ్యూరప్ప కొంచెం టెంక్షన్ లో ఉన్నాడు. కానీ , తాజాగా ఆయనకి ఒక ఆపన్న హస్తం అందినట్టు తెలుస్తుంది. అదేమిటి అంటే .. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వ్యూహాత్మకంగా వెనుక ఉండి సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాడని భావిస్తున్న దేవేగౌడ తన అపర చాణుక్యనీతిని మరోమారు ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తీసుకురావాలని ఉవ్విళ్ళూరుతున్న కాంగ్రెస్ ని గట్టి దెబ్బ కొట్టబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కూలిపోకుండా మధ్యంతర ఎన్నికలకు తావులేకుండా జేడీఎస్ అనూహ్య రీతిలో చక్రం తిప్పనుంది.
వారం క్రితం ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప , మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామిలు నాటకీయంగా భేటీ కావడమే కాకుండా సుదీర్ఘ చర్చలు జరిపారు. దీని కొనసాగింపులో భాగంగా జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ రెండు రోజులక్రితం ముఖ్యమంత్రి యడియూరప్పకు ఫోన్ చేసి ఈమేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని బలంగా వినిపిస్తోంది. ఈ తాజా పరిణామాలతో సుప్రీంకోర్టులో అనర్హ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలినా, డిసెంబరు 5న జరుగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థానాలు గెలవలేకపోయినా ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రారంభంలో బయటనుంచి మద్దతు ఇవ్వాలని తద్వారా ప్రభుత్వ సహకారంతో తమ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు విరివిగా గ్రాంట్లు రాబట్టుకోవాలని దళపతి పక్కా ప్లాన్ వేసినట్టు సమాచారం. దీనితో బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్న ఎమ్మెల్యే లకి ముక్కుతాడు వేసినట్టు అవుతుంది అని, పరోక్షంగా అధికార పగ్గాల చేపట్టేలా చాణుక్యనీతిని రూపొందించారు.