సీఎం భార్య సింగరైంది

Update: 2016-01-29 10:22 GMT
మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ భార్య అమృత ఫ‌డ్న‌విస్‌ హ‌ఠాత్తుగా బాలివుడ్ సినీ గాయ‌కురాలిగా మారిపోయారు.  ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ప్ర‌కాష్ ఝా తెర‌కెక్కిస్తున్న జై గంగాజ‌ల్ సినిమా కోసం అమృత ఒక పాట పాడారు.  సినిమాలో ఈ పాటను ప్రకాశ్  ఝా పైనే చిత్రీకరించారు.
   
జై గంగాజ‌ల్ సినిమాలో ప్రియాంకా చోప్రా పోలీసు ఉన్నతాధికారిణిగా న‌టిస్తుండ‌గా ఆమెకు జూనియ‌ర్‌ గా, డిప్యూటీ  సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ గా ప్ర‌కాష్ న‌టిస్తున్నారు. ఆ పాత్ర స్వ‌భావం మారుతున్న క్ర‌మంలో ఈ పాట తెర‌పై వ‌స్తుంద‌ట‌. అమృత ఈ పాట‌తో పాటు ఫిర్‌ సే అనే ప్రేమ‌క‌థా చిత్రంకోసం కూడా మ‌రొక పాట‌ని పాడారు.
   
అమృత బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. యాక్సిక్ బ్యాంక్‌ లో ఉన్న‌త ప‌ద‌విలో ఉన్న ఆమెకు బాలీవుడ్ లో పరిచయాలు ఉన్నాయని చెబుతారు.  ఫ‌డ్న‌విస్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యంలో, నాగ‌పూర్ బ్రాంచ్‌ కి వైస్ ప్రెసిడెంట్‌ గా ప‌నిచేస్తున్న ఆమె ముంబ‌యికి మారుతార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ముంబ‌యిలో ఆమె మ‌రో నూత‌న కెరీర్‌ లోకి అడుగు పెట్టే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టుగా క‌న‌బ‌డుతోంది. మహారాష్ర్ట సీఎం ప్రసంగాల్లో దిట్టయితే... ఆయన భార్య ఇలా పాటల్లో మేటిగా నిలుస్తున్నారన్నమాట.
Tags:    

Similar News