ఈ నేతకు క్రేజు ఫుల్..నియోజకవర్గం నిల్..

Update: 2018-09-04 11:18 GMT
చాలాకాలం కృష్ణా  జిల్లాను గుప్పిట పట్టిన ఫ్యామిలీ నుంచి వచ్చిన నేత ఆయన.. రాష్ట్ర రాజకీయాల్లోనూ వారి ఫ్యామిలీ చెరగని ముద్రే వేసింది. కానీ వర్తమానంలో మాత్రం కనీసం పోటీచేయడానికి నియోజకవర్గం లేని దుస్థితి వారిది.. 2019 ఎన్నికలు తరుముకొస్తున్నా టీడీపీ అధిష్టానం  - లోకేష్ బాబు ఇంకా సీటు - నియోజకవర్గం కన్ఫం చేయలేదు. ఇప్పుడు వారి కరుణమీదే ఇప్పుడా యువనేత గంపెడాశలు పెట్టుకున్నారు.

కృష్ణా జిల్లా రాజకీయాలను దశాబ్ధాల పాటు శాసించిన నేత దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఈయన తనయుడు దేవినేని అవినాశ్ భవిష్యత్ చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయి. 2019 ఎన్నికల బరిలోకి దిగడానికి అవినాశ్ సై అంటున్నా.. ఆయన పోటీ చేయడానికి ఏ నియోజకవర్గం దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో భారమంతా లోకేష్ బాబు పైనే వేశాడట అవినాష్..

2014 ఎన్నికల తర్వాత రాజకీయంగా స్తబ్దుగా ఉన్న దేవి నేని నెహ్రూ టీడీపీలో చేరి మళ్లీ యాక్టివ్ గా మారారు. కానీ నెహ్రూ అకాల మరణం తర్వాత నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అంతే దూకుడుగా రాజకీయం చేయడానికి అవినాష్ ప్రయత్నిస్తున్నారు. కానీ తనకంటూ పోటీచేయడానికి ఒక నియోజకవర్గం లేని స్థితి ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది.

ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని రెండు నియోజకవర్గాలపై అవినాష్ ఫోకస్ పెట్టారట.. ఒకటి పెనమలూరు.. రెండు నూజివీడు.. పెనమలూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ప్రసాద్ ఉన్నారు. ఆయనను తప్పించి అవినాష్ కు బాబు టిక్కెట్ ఇస్తాడా ఇవ్వడా అన్నది కొంచెం కష్టసాధ్యమైన పనే.. ఇక నూజివీడు విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ నేత మేక వెంకట ప్రతాప్ ఉన్నారు. ఇక్కడినుంచి టీడీపీ అభ్యర్థిగా చాన్స్ ఇవ్వాలని అవినాష్ కోరుతున్నారు.

దేవినేని నెహ్రుకు జిల్లా వ్యాప్తంగా అనుచర గణం ఉంది. దీంతో అవినాష్ ఎక్కడి నుంచి పోటీచేసినా గెలిచే అవకాశాలున్నాయి. కానీ నూజివీడులో అయితే అసమ్మతి లేకుండా గెలిచే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడే నియోజకవర్గం కేటాయిస్తే పనిచేసుకుంటూ పోతామని.. 2019 ముంగిట ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. టీడీపీ అధిష్టానం తొందరగా నియోజకవర్గం కేటాయించాలని అవినాష్ వర్గం కోరుతోందట..

లోకేష్ టీంలో మెంబర్ గా అత్యంత సన్నిహితుడిగా ఉన్న అవినాష్.. తనకు టిక్కెట్ ఇప్పించే భారం మొత్తం యువనేతపైనే పెట్టాడట.. మరి వచ్చే ఎన్నికల్లో అవినాష్ కు టిక్కెట్ దక్కుతుందా.? పోటీ చేస్తారా.?  ముందుకు నియోజకవర్గమైనా కన్ఫం చేయండని కోరుతున్నారు. ఇప్పుడు అవినాష్ భవిష్యత్తు మొత్తం యువనేత సామర్థ్యంపైనే ఉందంటున్నారు కృష్ణ జిల్లా నేతలు..
Tags:    

Similar News