కుంప‌ట్లుః వ‌ల్ల‌భ‌నేనిపై ఫైర్ అయిన దేవినేని

Update: 2016-09-19 16:33 GMT
టీడీపీలో ఇటీవ‌లే చేరిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ - దేవినేని నెహ్రు మీడియాతో ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. సైకిల్ ఎక్కుతున్న సంద‌ర్భంగా త‌న‌కు ఎదుర‌యిన‌ సంఘ‌ట‌న‌ల‌ను - ప్ర‌స్తుతం ఎద‌ర‌వుతున్న ప‌రిణామాల‌ను మీడియాతో పంచుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌రోక్షంగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ - మ‌రో ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుల‌ను టార్గెట్ చేశారు. ఏకంగా పార్టీ అధినేత చంద్ర‌బాబును లైన్లోకి లాగి హెచ్చ‌రించారు. తాజాగా విజ‌యవాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగుదేశంలో చేరిన‌ సందర్బంగా వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా త‌న‌కు మంచి భవిష్యత్ ఇచ్చింద‌ని దేవినేని నెహ్రూ చెప్పారు. ఎన్నిక‌ల్లో త‌న‌ ఓటమికి పార్టీ కారణం కాదని నెహ్రూ స్ప‌ష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి మాత్రమే టీడీపీ లో ఉన్నానని అంత‌క‌ముందు టీడీపీకి అనుకూలంగా ప‌నిచేస్తూ కాంగ్రెస్‌ కు ద్రోహం చేయ‌లేద‌న్నారు.

టీడీపీ నాయ‌కుడిగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాద్యత త‌మ‌పై ఉందని దేవినేని నెహ్రూ తెలిపారు. ఈ క్ర‌మంలో సీఎం చంద్రబాబుని కలిసి ఆయనతో సంప్రదింపులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పార్టీ బలోపేతానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నామ‌ని చంద్రబాబు సలహాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీకి పని చేయించటం ద్వారా గుర్తింపు వస్తుందని చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరటం మింగుడు పడని నేతల సంగతి చంద్రబాబు చూస్తారని ప‌రోక్షంగా పార్టీ ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ - బోండా ఉమేశ్వ‌ర‌రావుల‌కు హెచ్చ‌రిక‌లు పంపించారు. త‌న ప‌రిధి కృష్ణా జిల్లా అంతా తప్ప నియోజక వర్గం కాదని స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News