కరోనా రోగులకు మరో శుభవార్త!!

Update: 2020-07-18 13:30 GMT
ప్రపంచాన్ని ఆవహించిన కరోనాను జయించడానికి మనిషి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీకా తయారీ కోసం సైంటిస్టులు శ్రమిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. శీతల దేశాల్లో కరోనా తీవ్రత తీవ్రంగా ఉంది.

ఇప్పటికే రెండు మూడు ఔషధాలు కరోనాకు వచ్చాయి. తాజాగా బ్రిటన్ పరిశోధకులు కరోనా రోగులకు మరో శుభవార్త చెప్పారు. కరోనా మరణాలను తగ్గించగల ఔషధాన్ని వారు గుర్తించారు.

‘డెక్సామెతాసోన్’ అనే జనరిక్ స్టెరాయిడ్ డ్రగ్ కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇస్తే బాగా పనిచేస్తోందని తేలింది. శరీరంలో మంటలను బాగా తగ్గిస్తుంది. ఈ ఔషధాన్ని తక్కువ మోతాడులో కరోనా రోగులకు ఇవ్వడం వల్ల మరణాల ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. పరిస్థితి విషమించిన వారికి ఈ ఔషధం బాగా పనిచేస్తోందని తేలింది.

ఇక ఈ ఔషధం ధర కూడా తక్కువేనని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు తెలిపారు. మరణాల రేటును ఇది తగ్గిస్తుందని తెలిపారు. వెంటిలేటర్ పై ప్రాణాపాయంగా ఉన్న వారికి ఈ మందు ఇవ్వవచ్చని తెలిపారు.
Tags:    

Similar News