రాజ‌కీయాల్లోకి డీజీపీ సాంబ‌శివ‌రావు?

Update: 2017-12-29 08:08 GMT
ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అంశం ఏపీ డీజీపీ ఎన్‌.సాంబ‌శివ‌రావు. డీజీపీ బాధ్య‌త‌ల‌ను త‌న‌దైన శైలిలో నిర్వ‌హించి ఇటు శాంతిభద్ర‌త‌ల ప‌రంగా...అటు ఉద్య‌మాల ప‌రంగా మ‌రోవైపు కీల‌క‌మైన మావోయిస్టుల అణిచివేత‌ ప‌రంగా ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న డీజీపీ సాంబ‌శివ‌రావు త్వ‌ర‌లో రిజ‌టైర్ కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న‌కు సంబంధించి కొత్తవార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే..డీజీపీగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత రాజ‌కీయాల్లోకి రావ‌డం.

రాష్ట్ర అత్యున్న‌త పోలీస్ అధికారిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత ఓ ప్ర‌ధాన రాజ‌కీయ‌పార్టీలో ఈ పోలీస్ బాస్ చేర‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్ప‌టికే ఇందుకు త‌గిన నిర్ణ‌యం తీసుకున్నార‌నే జోస్యం వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌నే ఈ వార్త‌పై మీడియాతో స్పందించారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని డీజీపీ ఎన్‌ సాంబశివరావు స్పష్టం చేశారు. పదవీ విరమణ తరువాత ముందుగా మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయ‌న వివ‌రించారు. మూడు నెలలు విశ్రాంతి తరువాతే భవిష్యత్తు కార్యచరణపై నిర్ణయం తీసుకుంటానని డీజీపీ తెలిపారు. తాను ఏది చేయాలనుకున్నా ముందుగా మీడియాకే చెబుతానన్నారు.

ఈ సంద‌ర్భంగా డీజీపీగా తానందించిన సేవలపై సాంబ‌శివ‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు.కులపరమైన ఆందోళనలను కట్టడి చేశానన్నారు. మావోయిస్టులను అణచివేసినట్లు వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ - పోలీస్‌ శాఖ అభివృద్ధి - సంక్షేమానికి తన వంతు కృషి చేశానన్నారు.  ఆధునిక సౌకర్యాలతో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ - కొన్ని జిల్లాల్లో మోడల్‌ పోలీస్‌ స్టేషన్లనూ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో సహోద్యోగుల సమన్వయంతో పూర్తి చేసినట్లు చెప్పారు.
Tags:    

Similar News