తేడా వ‌చ్చిందో...కాపులు, ద‌ళితుల‌కు క‌ష్టాలే

Update: 2017-07-25 10:33 GMT
కాపు రిజ‌ర్వేష‌న్ కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చ‌లో అమరావ‌తి యాత్ర నేప‌థ్యంలో ఏపీ డీజీపీ సాంబశివరావు స్ప‌ష్ట‌మైన హెచ్చ‌రికలు జారీ చేశారు. బుధ‌వారం ముద్ర‌గ‌డ యాత్ర నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో విజయవాడలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ రేపటి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పర్మిషన్ లేదని స్ప‌ష్టం చేశారు. ప‌ర్మిషన్ కావాలని ముద్రగడ అడగలేదని డీజీపీ వివ‌రించారు. జిల్లా పరిధి దాటి జరిగే పాదయాత్ర కాబట్టి అనుమతికి ఇబ్బంది అని తెలిపారు.

గత చరిత్ర బట్టే అనుమతులు ఇవ్వాల వద్దా అనేది నిర్థారణ ఉంటుంద‌ని డీజీపీ వివ‌రించారు. గతేడాది బౌతిక దాడులు - ఆస్థి నష్టం - ప్రజలకు ఇబ్బంది - 60 - 70 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. 2009లో సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందేన‌ని డీజీపీ తెలిపారు. అనుమతి లేని కార్యక్రమంలో పాల్గొంటే చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. చట్ట వ్యతిరేక యాత్రలో కాపు - దళిత యువత యాత్రలో పాల్గొన కూడదని మనవి చేసిన డీజీపీ ఏ నేరం జరిగినా...ఆస్థినష్టం జరిగినా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. సెక్షన్ 30 - 144 ప్రకారం సభలు - సమావేశాలు - ర్యాలీలకు అనుమతి లేదని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ముద్ర‌గ‌డ ముందుకు సాగితే ఈ క్ర‌మంలో రాష్ట్ర - కేంద్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన ఆస్తులు ధ్వంసం జరిగినా తీవ్రపరిణామాలు ఉంటాయ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు.

తాము ఎవరికీ వ్యతిరేకం కాదు - త‌మ‌కు అందరు సమానమేన‌ని డీజీపీ తెలిపారు. చట్టం వ్యతిరేక చర్యలకు త‌మ‌ బాధ్యత మేం నిర్వహిస్తామ‌న్నారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం పాదయాత్ర చేసేందుకు సన్నాహాలు జరిగాయని తెలుస్తోందని ఏపీ డీజీపీ తెలిపారు. కోస్తా ప్రాంతంలో రెండు ర్యాపిడ్ యాక్షన్ పోర్స్ పని చేస్తున్నాయని డీజీపీ వెల్ల‌డించారు. అమరావతి - గుంటూరులో కూడా భారీ బందోబస్తు చేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News