ఓ పోలీసు అధికారికి పదోన్నతి కల్పించడంలో నిర్లక్ష్యం చేసినందుకు రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఈ రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను కోర్టుకు రప్పించడానికి దారి తీసిన పరిస్ధితులపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్సై రామారావు పదోన్నతి విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ నేడు హైకోర్టులో హాజరు అయ్యారు.
ఎస్ఐ రామారావు తనకు పదోన్నతి లో అన్యాయం జరిగిందని తనకు సిఐగా పదోన్నతి ఇవ్వకుండా తన జూనియర్లకు పదోన్నతి కల్పించారని గతంలో హై కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హై కోర్టు ఎస్ఐ రామారావుకు పదోన్నతి కల్పించాలని పోలీస్ శాఖకి ఆదేశాలు ఇచ్చింది.
అయితే, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీస్ శాఖ అధికారులు అమల్లో పెట్టలేదు. దీనితో కోర్టు ధిక్కార నేరం కింద ఎస్ ఐ రామారావు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై డిజిపి గౌతం సవాంగ్ స్వయంగా కోర్టుకు వచ్చి సమాధనం ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. హై కోర్టు ఆదేశాలమేరకు గౌతం సవాంగ్ ఈ రోజు హైకోర్టుకు హాజరు అయ్యారు. రామారావుకు సిఐగా ఇటీవల పదోన్నతి ఇచ్చామని హైకోర్టుకు డీజీపీ సవాంగ్ వెల్లడించారు.
అయితే పదోన్నతి ఎందుకు ఆలస్యమైందని హైకోర్టు ఆయన్ను ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని కోర్టు అడగడంతో తమ డిపార్మెంట్ అప్పీల్ కు వెళ్లినందునే ఆలస్యం అయ్యిందని హైకోర్టుకు గౌతం సవాంగ్ తెలిపారు.
ఈ సందర్భంగా గౌతం సవాంగ్ నిజాయితీపడు, సమర్థుడైన అధికారే అని, క్రింది స్థాయి అధికారుల పొరపాట్ల వల్ల ఉన్నతాధికారులు కోర్టులకు రావలసి వస్తోందని హైకోర్టు తెలిపింది. అధికారులు పై అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సక్రమంగా పనిచేసేట్లు చేసుకోమని డీజీపీకి సూచించింది. అలాగే, వచ్చే విచారణకు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే ,
ఇదిలా ఉంటె గత కొద్దీ రోజుల క్రితం ఈ కేసులో విచారణకు హాజరు కావాలని డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎన్నికల విధుల్లో ఉండటంతో హాజరు కాలేమని వారిద్దరూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. సుప్రీం తీర్పు వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్ కోరుతున్నప్పుడు.. ఎన్నికల విధులని ఎలా అంటారని ప్రశ్నించింది. 27 న తప్పకుండా తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు డిజిపి గౌతం సవాంగ్ హైకోర్టు ముందు హాజరైయ్యారు.