వైఎస్ జగన్ పాదయాత్ర వేళ వైసీపీ నుంచి పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థులను అనాడు జగన్ తోపాటు ప్రకటించిన వారిలో ధర్మాన ప్రసాద్ రావు, నందిగాం సురేష్ లు ఉన్నారు. ధర్మానా అప్పుడు అన్నీ తానై మైక్ పట్టుకొని అభ్యర్థుల్ని ప్రకటించారు. వైసీపీ గెలిస్తే ధర్మాన మంత్రి అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ట్రెయిన్ రివర్స్..
వైసీపీ ప్రభుత్వం వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాద్ రావుకు మంత్రిపదవి ఖాయమనుకున్నారంతా.. కానీ సీఎం జగన్ ట్విస్ట్ ఇచ్చారు. ధర్మాన అన్నగారైన క్రిష్ణదాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. తమ్ముడు ప్రసాద్ రావుకు షాకిచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలకమైన రెవెన్యూశాఖను నిర్వహించిన ప్రసాద్ రావును జగన్ పక్కనపెట్టడం సంచలనమైంది.అప్పటి నుంచి ఇంటా బయటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ధర్మానా తాజాగా బయటపడ్డారు.
తాజాగా అన్న క్రిష్ణ దాస్ - మరో మంత్రి ఆళ్ల నాని అటెండ్ అయిన జిల్లా మీటింగ్ లో ధర్మాన ప్రసాద్ రావు ఆగ్రహించారు. ప్రభుత్వం మీద ఇండైరెక్టుగా మండిపడ్డారు.
దీంతో తమ్ముడి ఆవేదనను అర్థం చేసుకున్న అన్న మంత్రి కృష్ణ దాస్ రెండున్నరేళ్ల తర్వాత నువ్వే మంత్రివి అవుతావని.. ప్రభుత్వం మీద విమర్శలు వద్దని.. ఉన్నత పదవులు నీకు దక్కుతాయని భరోసా కల్పించారట.. ఇలా తమ్ముడిని ప్రస్తుతానికైతే కూల్ చేశారట..!