జార్ఖండ్ డైనమేట్, మిస్టర్ కూల్, ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి పరిచయం అక్కర్లేదు. ఓవైపు ఆటగాడిగా, మరోవైపు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డులు ధోనీ సొంతం. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ధోని కెప్టెన్సీలోనే భారత్ దక్కించుకుంది. ఈ విజయాల వెనుక ధోనీ వ్యూహాలదే కీలక పాత్ర. కేవలం టీ20, వరల్డ్ కప్‌లే కాకుండా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను సైతం పలుమార్లు విజేతగా నిలబెట్టిన అరుదైన రికార్డు ధోనీ సొంతం.
క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక ధోనీ వ్యాపారంపై దృష్టి సారించాడు. క్రికెటర్‌గా ఓవైపు ప్రకటనల ఎండార్స్‌మెంట్లు, మ్యాచుల ద్వారా భారీగా సంపాదించాడు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వ్యాపారంలో పెట్టి అందులోనూ క్రికెట్‌లో మాదిరిగానే రాణిస్తున్నాడు. అంతేనా జార్ఖండ్‌లో అతిపెద్ద పన్ను చెల్లింపుదారుడుగా ధోని నిలిచి రికార్డు సృష్టించాడు.
ధోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 17 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. గత సంవత్సరం రూ.13 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కింద డిపాజిట్ చేయగా ఈ ఏడాది రూ.4 కోట్లు అదనంగా రూ.17 కోట్లు చెల్లించారు. దీని బట్టి చూస్తే గతేడాదితో పోలిస్తే ఈసారి ధోనీ ఆదాయం 30 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. కాగా 2017–18లో జార్ఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా ధోనీ క్రికెటర్‌గా ఉన్నప్పటి నుంచే వ్యాపారం వైపు దృష్టి సారించాడు. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పూర్తిగా బిజినెస్ మీదే దృష్టి సారించాడు. మరోవైపు రిటైర్ అయినప్పటికీ తన క్రేజు తగ్గని ఈ మిస్టర్ కూల్ ఇప్పటికీ చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.
ఖాతా బుక్ యాప్‌కు స్పాన్సర్‌గా ఉండటంతో పాటు అందులో ధోనీ పెట్టుబడి కూడా పెట్టాడు. ఇటీవల విద్యా రంగంలోకి కూడా ప్రవేశించాడు. బెంగళూరులో ఎంఎస్ ధోని గ్లోబల్ స్కూల్‌ను ప్రారంభించాడు.
మరోవైపు ఎంఎస్ ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో సినిమా నిర్మాణ రంగంలోకి కూడా ఈ జార్ఖండ్ డైనమేట్ అడుగుపెట్టాడు. వీటితో పాటు సేంద్రియ వ్యవసాయం, కడక్‌నాథ్ కోళ్ల పెంపకం కూడా చేపట్టాడు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటున్న ధోని తన వ్యవసాయ ఉత్పత్తులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.