పాక్ కెప్టెన్ కూతురిని ఎత్తుకున్న ధోనీ

Update: 2017-06-18 08:25 GMT
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి పొంగి పొర్లుతుంది. ఒక్కోసారి అది శ్రుతి మించుతుంది కూడా. మరికొద్ది గంటల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అభిమానుల్లో ఒకరకమైన ఉద్విగ్నత ఏర్పడింది. కొందరైతే ముక్కోటి దేవతలకూ పూజలు చేస్తున్నారు ఇండియా గెలవాలని.
    
ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాక్, భారత్ క్రికెట్ అభిమానులకు ఒక ఫోటోతో మంచి సందేశం చెప్పాడు. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ కుమారుడు అబ్దుల్లాను ధోనీ ఎత్తుకుని ఆడించాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆ ఫొటోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్సు వచ్చింది. వివాదాలు, విభేదాలు దేశాల మధ్య కానీ మనుషుల మధ్య కాదని ధోనీ నిరూపించాడని ఆయన్ను కీర్తిస్తున్నారు.

రెండు దేశాల మధ్య పోటీ ఎంత ఉన్నా సుహృద్భావ సంబంధాలు ఉండాలన్న సందేశం ధోనీ పోస్ట్ చేసిన ఫొటో ద్వారా తెలుస్తోంది. ఇక అసలు విషయానికొస్తే చాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్ దశలో ఇప్పటికే  పాక్‌ను ఓడించిన భారత్‌ ఫైనల్‌ లో కూడా గెలుపు సాధించడానికి సిద్ధంగా కనిపిస్తోంది. మంచి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతున్న టీమిండియా తమ కోరిక తీరుస్తుందని అభిమానులంతా ఆశగా ఉన్నారు. జయహో భారత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News