బాబుతో ధూళిపాళ్ల భేటీ...లోకేష్ సూచ‌న‌లు

Update: 2017-04-06 13:51 GMT
ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అసంతృప్తి సెగ‌లు ఒక్కొక్క‌టి సెట్ రైట్ అవుతున్న‌ట్లున్నాయి. తాజాగా టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబునాయుడును టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కలిశారు. మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తితో ఉన్న ధూళిపాళ్ల లోకేష్‌ సూచనల మేరకు చంద్రబాబును కలిశారు. సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయామని, భవిష్యత్‌ లో న్యాయం చేస్తానని చంద్రబాబు తెలిపారు.

ఇదిలాఉండ‌గా... తెలుగుదేశం సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు.  ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలలోకి తీసుకువెళ్లలన్నారు. పార్టీపైనా, ప్రభుత్వంపైనా సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని అరికట్టాలని అన్నారు.నామినేటెడ్ పదవులు పొందిన వారు పార్టీ పనులను మరచిపోయారని, ఈ పరిస్థితి మారాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పని తీరు బాగుంటే కులసమీకరణాలు ఎన్నికలలో పని చేయవని, యూపీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు. మునిసిపల్ ఎన్నికలలో ప్రతిస్థానం గెలవాలని చంద్రబాబు అన్నారు.

అనంత‌రం పార్టీ ప్రధాన కార్యదర్శి - పంచాయతీ - గ్రామీణాభివృద్ధి - ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పార్టీపై, ప్రభుత్వంపై సామాజిక మాధ్యమంలో జరుగుతున్న ప్రచారంపై ఆయనీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సామాజిక మాధ్యమంలో వ్యతిరేక ప్రచారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు పొందిన వారు పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News