శరీరంలో మధుమేహం పెరిగితే కొన్ని పదార్థాలు మాత్రమే తినాలి. నాలుకను చంపి మరి ఇష్టం లేని పదార్థాలను తినాల్సిన పరిస్థితి. అలాంటి మధుమేహులు కడుపునిండా ఏనాడు తిని ఉండరు. ఈ క్రమంలో మధుమేహం నియంత్రణ కోసం మెట్ ఫార్మిన్ ఎక్స్ టెండెడ్ రిలీజ్ (ఈఆర్) టాబ్లెట్లు వాడుతుంటారు. కొద్దోగొప్పో తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే ఇకపై వారు ఆ మందులు వాడొద్దని కొందరు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ మందులో చాలా వ్యర్థ పదార్థాలు ఉన్నాయని - వాటిని నిషేధించాలని అమెరికా సూచిస్తోంది. ఆ టాబ్లెట్లలో నైట్రోసోడిమిథిలామైన్ (ఎన్ డీఎంఏ) వ్యర్థ పదార్థం ఉండాల్సిన స్థాయి కంటే అధికంగా ఉందని అమెరికా ఆహార - ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ ఎఫ్ డీఏ) ప్రకటించింది.
యూఎస్ ఎఫ్ డీఏ లేబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని లాట్లలోని మెట్‌ఫార్మిన్ ఈఆర్ ఔషధాల్లో నిర్ధిష్ట స్థాయిలకు మించి ఎన్ డీఎంఏ ఉన్నట్లు వెల్లడైందని తెలిపింది. టైప్-2 మధుమేహంతో బాధపడే వారు మెట్ ఫార్మిన్ ఔషధాన్ని వినియోగిస్తారు. వ్యర్థాలు కలిగిన ఈ టాబ్లెట్లను స్వచ్ఛందంగా వెనక్కి రప్పించాలని ఐదు ఔషధ కంపెనీలను ఎఫ్ డీఏ తాజాగా కోరింది. మెట్ ఫార్మిన్ లో ఎన్ డీఎంఏ మలినాల స్థాయిని తగిన పరీక్షల ద్వారా తెలుసుకోవాలని ఈ ఔషధాన్ని సరఫరా చేస్తున్న కంపెనీలను కోరుతోంది. మెట్ ఫార్మిన్ టాబ్లెట్లను వెనక్కి రప్పిస్తే రోగులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆయా సంస్థలతో ఎఫ్ డీఏ చర్చలు చేస్తోంది.
అయితే ఆ ట్యాబెట్ లలో ఉన్న ఎన్ డీఎంఏ వ్యర్థాలు కేన్సర్ కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ టాబ్లెట్లలో మోతాదుకు మించి మలినాలు ఉండడానికి గల కారణాలను తెలుసుకోవాలని సంబంధిత కంపెనీలకు ఆదేశించింది. ఫినిష్డ్ డోసేజీ ఈఆర్ టాబ్లెట్లలో మాత్రమే అధిక మోతాదుల్లో ఎన్ డీఎంఏ వ్యర్థాలు ఉన్నాయని.. మెట్ ఫార్మిన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రిడియెంట్ల (ఏపీఐ) నమూనాల్లో స్థాయికి మించి వ్యర్థాలు లేవని ఎఫ్ డీఏ వివరించింది.
ఇతర దేశాల్లోని మెట్ ఫార్మిన్ ఔషధాల్లో ఎన్ డీఎంఏ వ్యర్థాలు వస్తున్నట్లు గుర్తించిన ఎఫ్ డీఏ 2019 చివరి నుంచే అప్రమత్తంగా వ్యవహరించింది. అమెరికాకు సరఫరా అవుతున్న మెట్ ఫార్మిన్ ఔషధంలో ఈ వ్యర్థాల స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2020 ఫిబ్రవరిలో కొన్ని నమూనాల్లో తక్కువ మోతాదుల్లోనే ఎన్ డీఎంఏ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించింది.
ఈ మందుల తయారీలో తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలు ఉన్నాయి. మెట్ ఫార్మిన్ మందును గ్రాన్యూల్స్ - అరబిందో ఫార్మా తదితర కంపెనీలు తయారు చేస్తున్నాయి. గ్రాన్యూల్స్ భారత విక్రయాల్లో అధిక భాగం మెట్ ఫార్మిన్ ఉంది. ఈ సంస్థ దాదాపు 70 శాతం వరకు మెట్ ఫార్మిన్ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే వ్యర్థ పదార్థాలు తమ కంపెనీకి చెందిన ఏపీఐ - ఫినిష్డ్ డోసేజీ ట్యాబ్లెట్ల నమూనాల్లో లేవని గ్రాన్యూల్స్ ఇండియా తెలిపింది. అరబిందో ఫార్మా - సన్ ఫార్మా - లూపిన్ - హెరిటేజ్ ఫార్మా సహా మరికొన్ని సంస్థలు కూడా మెట్ ఫార్మిన్ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి. త్వరలోనే ఈ కంపెనీలో కూడా ఆ ట్యాబ్లెట్ ను పరిశీలించనున్నాయి.