ఔను. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలోనే...ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని నడిపించే నాయకుడిగా అప్రకటితంగానే అందరికీ సుపరిచితం అయిపోయిన యువరాజు లోకేష్ కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందట. చట్టసభల మెట్లు ఎక్కకుండా చేయాలనేది లోకేష్ వ్యతిరేకుల ఎత్తుగడనట. ఇలా చేస్తోంది ఎవరో ముక్కూ మొహం తెలియని వారేంకాదు. సాక్షాత్తు మంత్రి పదవిలో ఉన్నవారే..లోకేష్ బాబుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారట. ఇంతకీ అలాంటి నిందను ఎదుర్కుంటున్నది ఎవరయ్యా అంటే...తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత - చంద్రబాబు క్యాబినెట్ సహచరుడు అయిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. లోకేష్ ను ఆయన జ్ఞానం ఆధారంగానే ఈ విధంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు టార్గెట్ చేశారట.
వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ ఆది నుంచి తనదైన శైలిలో చిత్రమైన ప్రసంగాలకు పెట్టింది పేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. టీడీపీకి ఓటేస్తే ఉరేసుకున్నట్టే - కులపిచ్చి - మతపిచ్చి - బంధుప్రీతి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే - విభజన నాటికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన కోసం పోరాడింది.. అంటూ చిత్రవిచిత్రంగా మాట్లాడేశారు. ఎమ్మెల్సీగా షార్ట్‌కట్ ప్రజాప్రతినిధి అయి మంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం రోజునే సార్వభౌమాధికారం.. అనే చిన్న పదాన్ని సరిగా పలకలేకపోయాడు. తద్వారా సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యారు. ఇలా లోకేష్ ప్రసంగాల సత్తాతో టీడీపీ నేతలే నవ్వుకుంటున్న పరిస్థితి. ఇలా చినబాబు గురించి పెద్ద ఎత్తున నవ్వుకుంటున్న సమయంలో అయ్యన్నపాత్రుడు కొత్త రూల్ ఒకటి ప్రతిపాదించారు.
ఇంతకీ అయ్యన్న చెప్తున్న రూల్ ఏంటంటే...‘ ఇక నుంచి నామినేషన్ వేసే సమయంలో వందేమాతర ఆలాపనను తప్పనిసరి చేయాలి. సరిగా పాడిన వాళ్ల నామినేషన్నే ఆమోదించాలి. వందేమాతరం కూడా సరిగా పాడటం రాని వాళ్లు మంత్రులుగా - ఎమ్మెల్యేలుగా చలామణి అయిపోతూ ఉన్నారు`` అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ల అర్థం పార్టీపై రుద్దబడిన యువరాజ వారి సామర్థ్యం గురించి ఎద్దేవా చేయడమేనని అంటున్నారు. ఇంకొందరైతే...లోకేష్ బాబును టార్గెట్ చేసిన కుట్ర అంటూ విమర్శిస్తున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా....నాయకుల మాట తీరు ఆధారంగా ప్రజాప్రాతినిధ్యం అవకాశం కల్పిస్తే...చినబాబు గారి సంగతి అంతేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.