గడిచిన కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉండిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తిరిగి ఏపీకి వెళ్లాలన్న విషయం తెలిసిందే. ఎల్ జీ పాలీమర్స్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలతో.. విశాఖ ప్రజల్ని పరామర్శించేందుకు అక్కడకు వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో కేంద్రానికి అనుమతి కోరారు. ఏమైందో కానీ.. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు అప్లికేషన్ పెట్టుకున్నారు.
బాబు అప్లికేషన్ కు తెలంగాణ పోలీసులు వెంటనే స్పందించి.. ఏపీకి వెళ్లేందుకు వీలుగా అనుమతి పత్రాన్ని జారీ చేశారు. ఏపీ అధికారులు మాత్రం కాస్త ఆలస్యంగా బాబు అప్లికేషన్ ను ఓకే చేశారు. దీంతో.. ఆయన ఏపీకి వెళ్లేందుకు వెసులుబాటు లభించినట్లైంది. ఇక్కడే.. ఊహించని తప్పు జరిగినట్లు చెబుతున్నారు.
ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో.. ప్రతి దరఖాస్తుదారుడు తన ఫోన్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రూల్ కు తగ్గట్లే చంద్రబాబు.. నారా లోకేశ్ తదితరులు తమ ఫోన్ నెంబర్లను నమోదు చేశారు. బాబు లాంటి వీవీఐపీకి పాస్ జారీ చేసే వేళలో.. వారి ప్రైవేటు ఫోన్ నెంబర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా వారి ఫోన్ నెంబర్లతో సహా ఈ-పాస్ ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యల వల్ల.. బాబుకు ప్రమాదమని చెబుతున్నారు. ఎందుకిలా జరిగిందన్న వివరణను ఏపీ అధికారులు ఇవ్వాల్సి ఉందంటున్నారు.