గడిచిన కొద్ది రోజులుగా పెద్ద ప్రశ్న ఒకటి వేధిస్తోంది. బ్రిటన్ ను రచ్చ చేస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ తెలంగాణకు వచ్చిందా? రాలేదా? అన్నది సందేహంగా మారింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై బ్యాన్ పెట్టినప్పటికీ.. అంతకు ముందే వందలాది మంది తెలంగాణకు వచ్చేశారు. వారిలో కొద్దిమందికి పాజిటివ్ వచ్చింది. దీంతో.. వారికి వచ్చింది కొత్త కరోనానా? లేదా? అన్నది సందేహంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల ప్రకారం డిసెంబరు తొమ్మిది నుంచి ఇప్పటివరకు యూకే నుంచి 1216 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 937 మందిని గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం నాటికి వారిలో 16 మందికి వైరస్ నిర్దారణ కాగా.. శనివారం మరో ఇద్దరికి పాజిటివ్ గా తేలింది. ఈ పద్దెనిమిది మందిలో నలుగురు హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వాసులు ఆరుగురు.. జగిత్యాలకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు.
మంచిర్యాల.. నల్గొండ.. రంగారెడ్డి.. సంగారెడ్డి.. సిద్దిపేట.. వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరికి సోకింది కొత్త కరోనానా? లేదంటే పాతదేనా? అన్నది ప్రశ్నగా మారింది. వారి వద్ద సేకరించిన శాంపిళ్లను పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి తెలంగాణలో బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చిందా? రాలేదా? అన్న విషయంపై క్లారిటీ రానుంది. ఇక.. పాజిటివ్ తేలిన వారితో కాంటాక్టులో ఉన్న 79 మందిని గుర్తించిన అధికారులు.. వారిని క్వారంటైన్ సెంటర్లకు చేర్చారు. వీరందరికి పరీక్షలు నిర్వహిస్తే.. ఇప్పటివరకు ముగ్గురికి పాజిటివ్ గా తేలింది.
ఇదిలా ఉంటే.. యూకే నుంచి వచ్చిన వారిలో 92 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా.. అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వారి చిరునామాలు సమగ్రంగా లేకపోవటంతో వారి పాత అడ్రస్ లు.. ఫోన్ నెంబర్ల ఆధారంగా వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. డిసెంబరు 9 తర్వాత రాష్ట్రానికి నేరుగా కానీ.. యూకే నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి.. తెలంగాణకు వచ్చిన వారు కానీ ఉంటే.. సదరు ప్రయాణికులు స్వచ్చందంగా 9154170960కు ఫోన్ చేసి వివరాలు తెలపాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పాజిటివ్ గా గుర్తించిన వారి శాంపిళ్లను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తోంది సీసీఎంబీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రోజు (ఆదివారం) సాయంత్రం వెల్లడి కానుంది. దీంతో.. చాలా సందేహాలకు సమాధానం లభించనుంది.