ఎలన్ మస్క్ తొలినాళ్లలో డబ్బుల కోసం ఆ పనిచేశాడా?

Update: 2022-05-04 23:30 GMT
అత్యంత ప్రజాదరణ పొందిన బిలియనీర్ ఎలన్ మస్క్ తొలిరోజుల్లో అత్యంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడన్న విషయం చాలా మందికి తెలిసింది. ఆయన పుట్టుకతోనే సంపన్నుడు కాదు. బంగారు పల్లాల్లో తినలేదు. సంపన్నుల కుటుంబంలో పుట్టలేదు. చాలా పేదరికంలోనే పుట్టాడు..పెరిగాడు. కష్టపడి ఈస్థాయికి చేరాడు.  చాలా మంది ఊహించినట్లుగా ధనవంతుడు కాదు. ట్విటర్‌ వేదికగా ఆయన ఓ సంభాషణలో దీనిపై వివరణ ఇచ్చారు. షాకింగ్ కామెంట్స్ చేశాడు. డబ్బుల కోసం తన రూంను నైట్ క్లబ్ కు అద్దెకు ఇచ్చాడని సంచలన విషయం బయటపడింది.

మస్క్ తన కెరీర్ తొలి నాళ్లలో చాలా నిరాడంబరమైన జీవితం గడిపాడని చెప్పుకొచ్చాడు. ఒక ట్వీట్‌లో ఈ మేరకు క్లారిటీ ఇచ్చాడు.  “ఎలన్ మస్క్ జీవితంలో విపరీతమైన విజయం సాధించడానికి కారణం ఏమిటి? ఈ ధనవంతుల పిల్లలందరూ ఆర్ట్ స్కూల్‌కి ఎందుకు వెళతారు?ఎప్పుడూ ఉద్యోగం పొందకుండా, ఎందుకు వృధా చేసుకుంటారో నాకు వివరించండి”.అని ఒక నెటిజన్ సూటిగా ఎలన్ మస్క్ను ప్రశ్నించాడు.

“అవును, చాలా డబ్బు ఖర్చు చేసి వారి పిల్లలను చదివిస్తారు.వీరు సాధారణంగా ఏమీ లేని వారి కంటే చాలా తక్కువ ప్రేరణను కలిగి ఉంటారు. మేము 1995లో మా మొదటి కంపెనీని (జిప్2) ప్రారంభించినప్పుడు, నా దగ్గర కేవలం లక్ష డాలర్ల కంటే తక్కువే రుణం ఉంది. నేను స్వయంగా నిర్మించుకున్న కంప్యూటర్ తోనే పనిచేశాను. అప్పుడు బతకడానికి చాలా కష్టపడ్డాను" అని ఎలన్ మస్క్ బదులిచ్చారు.

భారతదేశానికి చెందిన ప్రణయ్ పాథోల్ దీనిపై ఒక సూటి ప్రశ్నను ఎలన్ మస్క్ కు సంధించాడు. “ప్రజలు మీరు ఇప్పటికే సంపన్న కుటుంబానికి చెందిన వారని.. మీ నాన్నకు బంగారు గని ఉందని అబద్ధాలు ప్రచారం చేశారు. జిప్ 2ని ప్రారంభించేటప్పుడు మీరు ఉండడానికి స్థలం లేదు.. అద్దె గదుల్లో స్నానం చేయాల్సి వచ్చింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు మీరు నైట్‌క్లబ్‌ కు మీ గదిని అద్దెకు ఇవ్వలేదా?" అంటూ ఎలన్ మస్క్ ను ట్యాగ్ చేసి ప్రశ్నించాడు.

దీన్ని ఎలన్ మస్క్ అంగీకరించారు. "అవును, నేను మా ఇంటిని నైట్‌క్లబ్‌గా మార్చడం ద్వారా అద్దెకు ఇచ్చాం. అప్పుడు అలా చేసినందుకు $5 డాలర్లు వసూలు చేసాము" దాంతో మా అవసరాలు తీర్చుకున్నాం అని ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చాడు.

కాబట్టి గతంలో ఎలోన్ మస్క్ అత్యంత పేదరికాన్ని అనుభవించాడని ఆయన మాటల ద్వారానే తేలింది.. పెన్సిల్వేనియాలో తన చదువు తర్వాత మస్క్ వ్యాపారాన్ని కొనసాగించేందుకు 1995లో కాలిఫోర్నియాకు వెళ్లి జిప్2ని స్థాపించాడు. అనంతరం 2002లో స్పేస్ ఎక్స్ ని ప్రారంభించి.. 2004లో టెస్లా కంపెనీలో చేరాడు. వాటిల్లో లాభాలతో ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఎదిగాడు.. మిగిలిన కథ అందరికీ తెలిసిందే.
Tags:    

Similar News