వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజులో అనర్హత వేటు భయం మొదలైందా ? తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుండి జగన్ అమరావతి చేరుకున్న మరుసటి రోజే పార్టీ చీఫ్, ఎంపి మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని నోటీసు అందించారు.
ఇపుడదే విషయమై ఎంపి మాట్లాడుతు తనమీద అనర్హత వేటు వేయటం అంత ఈజీ కాదన్నారు. పైగా తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని తన చర్యలను సమర్ధించుకుంటున్నారు. సరే అనర్హత వేటు పీకలమీదకు వచ్చినపుడు ఎవరైనా ఇలానే తమ చర్యలను సమర్ధించుకుంటారు. చాలామందిలాగే ఇపుడు రఘురామ కూడా అదే మాట్లాడుతున్నారు. పైగా స్పీకర్ ను కలిసి తనపై పార్టీ ఇచ్చిన అనర్హత వేటును పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేయటమే ఆశ్చర్యంగా ఉంది.
తనపై అనర్హత వేటు వేయటం సాధ్యంకాదని నిజంగానే ఎంపిలో అంత ధీమా ఉంటే స్పీకర్ ను కలిసి అనర్హత వేటు నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఏముంది ? జగన్ కు వ్యతిరేకంగా స్పీకర్ తో పాటు అనేకమందిని కలిసి ఫిర్యాదు చేసిన ఇదే ఎంపి పార్టీ తనపై ఇచ్చిన అనర్హత నోటీసుపైన మాత్రం ఎందుకింత స్పీడుగా రియాక్టవుతున్నారు ? ఎంపి రియాక్షన్ చూస్తుంటేనే తెలిసిపోతోంది ఆయన భయం మొదలైందని.
తాను ఏ పార్టీ అంటే వైఎస్సార్సీపీ తరపునైతే గెలిచారో అ పార్టీ అసలు జగన్ ది కానే కాదని కేంద్ర ఎన్నికల కమీషన్ కు వెళ్ళి ఎంపి ఫిర్యాదు చేసింది వాస్తవం కాదా ? వైఎస్సార్సీపీ తనదే అంటు అన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మహబూబ్ భాషా కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయటంతో పాటు ఢిల్లీ కోర్టులో కేసు కూడా వేశారు. అప్పుడు ఎంపి కూడా భాషాకు మద్దతుగానే మాట్లాడటం నిజంకాదా ?
అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపి కేసు వేయటం నిజమే కదా. నిజానికి జగన్ మీదున్న కేసులకు ఎంపికి ఎలాంటి సంబంధమూ లేదు. అయినా సరే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో కేసు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? అసలు పార్టీయే జగన్ ది కాదని, జగన్ కు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటీషన్ వేయటమంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు కాదా ? జగన్ వేరు, పార్టీ వేరని రఘురామ అనుకుంటున్నారా ?
జగన్ కు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే అందులో తప్పులేదు. కానీ పార్టీసభ్యత్వానికి దాని ద్వారా వచ్చిన ఎంపి పదవికి ముందు రాజీనామా చేయాలి. ఆ తర్వాత తనిష్టం వచ్చినట్లు ఫైట్ చేయచ్చు. అలా కాకుండా తానేమీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనను ఎవరు ఏమీ చేయలేరని అంటున్నారంటేనే ఎంపిలో భయం మొదలైనట్లే లెక్క. చూద్దాం ఏమి జరుగుతుందో.