2400 కేజీల భారీ బాంబు పేలేటప్పుడు చూశారా?

Update: 2020-10-15 06:45 GMT
ఒక బాంబు.. అది కూడా భారీ బాంబు ఒకటి పేలే సమయంలో చూసే అవకాశం ఉంటుందా? అదెలా సాధ్యమంటారా? కొన్నిసార్లు అన్ని సాధ్యమే అవుతాయి. తాజాగా ఒక భారీ బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పొరపాటున పేలిపోయింది. దీనికి సంబంధించి ముందుగా రికార్డు చేసే సరంజామాను సిద్ధంగా ఉంచుకోవటం తో భారీ బాంబు పేలినప్పుడు ఎలా ఉంటుందో చూసే అవకాశం ప్రపంచ ప్రజలకు లభించింది. ఇంతకూ.. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందంటారా? అక్కడికే వస్తున్నాం.

రెండో ప్రపంచ యుద్ధం లో ప్రయోగించిన బాంబు ఒకటి పేలకుండా ఇంకా అలానే ఉన్న విషయాన్ని ఆ మధ్యన గుర్తించారు.దాదాపు ఏడాది క్రితం పోలాండ్ లో ఒక బాంబును గుర్తించారు. 1945లో నాజీ యుద్ధ నౌక పై  రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ బాంబును వేస్తే.. అది కాస్తా పేలలేదు. అలా ఉండి పోయిన ఈ బాంబును కొంతకాలం క్రితం భూమి లోపల ఉండి పోయింది. ఈ మధ్యనే అది కాస్తా బయట పడింది. దీని బరువు 5 టన్నులు (5వేల కేజీలు) కాగా.. దీనిలో 2400 కేజీల పేలుడు పదార్థం ఉందన్న విషయాన్ని గుర్తించారు.

ఈ బాంబుకు ముద్దుగా టాల్ బాయ్ అని పేరు పెట్టిన అధికారులు.. దీన్నిపేలకుండా నిర్వీర్యం చేయాలని భావించారు. ఇందుకోసం సముద్రాన్ని వేదికగా చేసుకున్నారు. ఇందులో భాగంగా బాల్టిక్ సీ సముద్రంలో ముంచి.. దీన్ని పేలకుండా చేయాలనుకున్నారు.కానీ.. అనూహ్యంగా అది పేలిపోయింది. దీంతో ఉప్పెన మాదిరి నీరు ఒక్కసారిగా పైకి ఎగిసిపడింది. ఈ సీన్ ను కెమేరా లో షూట్ చేశారు. ఎందుకైనా మంచిదన్న ముందు జాగ్రత్తతో.. బాంబును పేల్చే ప్రదేశానికి దాదాపు రెండున్నర కిలో మీటర్ల లో ఉండే ఇళ్లలోని వారిని అధికారులు తరలించారు. మొత్తానికి ఎలాంటి ప్రాణ.. ఆస్తి నష్టం చోటు చేసుకోకుండా ఈ పేలుడు చోటు చేసుకోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాదు.. ఇన్ని వేల కేజీల బాంబు పేలినప్పుడు ఎలా ఉంటుందో చూసే అవకాశం దక్కినట్లైంది.ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోటో మీద ఒక లుక్ వేయండి.
Tags:    

Similar News