ఎర్రచందనం ఎంత విలువైందో.. వాటిని ఎలా స్మగ్లింగ్ చేసి కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారో పుష్ప సినిమాలో వివరంగా చూపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను మించి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమాల్లో పాల లారీలను ప్రత్యేకంగా డిజైన్ చేయించి.. అడుగున ఎర్రచందనం చెక్కలను పెట్టి.. దాన్ని మూసివేసి పైన పాలు పోసుకుని స్మగ్లింగ్ చేస్తుంటారు.
ఇప్పుడు ఇలాగే గుజరాత్ లో స్మగ్లర్లు తెలివి మీరారు. గుజరాత్‌లోని గ్రామాల్లో గుడారాలు వేసుకొని వనమూలికలు, దువ్వెనల విక్రయాల పేరుతో చందనపు చెట్లను దొంగిలించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరంతా మధ్యప్రదేశ్ కు చెందినవారు అని తెలుస్తోంది.
కాగా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలో పిల్లలు, మహిళలు కూడా ఉండటం విశేషం.అయితే వీరు పట్టుపడినప్పుడు పుష్ప సినిమా పోస్టర్స్ తో కూడిన షర్ట్స్ వేసుకొని ఉండటం కొసమెరుపు. పుష్ప మూవీ ఇన్స్పిరేషన్ ఆలా పనిచేస్తుంది అని అంటున్నారు.
గుజరాత్‌లోని సౌరాష్ట్రతోపాటు పలు ప్రాంతాల్లో చందనపు చెట్లను పెంచడం ప్రారంభించారు. ఎర్రచందనం ధర ఎక్కువగా ఉండటంతో దాన్ని దొంగిలించడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు గుజరాత్ కు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ దొంగల ముఠాలు చెట్లను నరికి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయని అంటున్నారు.
ఎర్రచందనం మొక్కల పెంపకంతో రైతులకు ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశంతో అడవుల్లోనే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో కూడా ఈ చెట్ల పెంపకానికి గుజరాత్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్మగ్లర్లకు వరంగా మారిందని అంటున్నారు.
ముందు ఈ చెట్లను సౌరాష్ట్ర, సెంట్రల్ గుజరాత్, దక్షిణ గుజరాత్‌లో పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వీటిని ఉత్తర గుజరాత్‌లో కూడా పెంచుతున్నారని చెబుతున్నారు.