ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్ - లైంగిక దాడి కేసులో ప్రముఖ మలయాళ హీరో దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దిలీప్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు పల్సర్ సునీ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దిలీప్ మాత్రం తాను అమాయకుడినని వాదిస్తున్నాడు. నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ అంటున్నాడు. తాజాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ చేయించాలని అంటున్నాడు. ఈ ప్రకారం దిలీప్.... కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశాడు. తనను కొందరు వ్యక్తులు కావాలనే ఈ కిడ్నాప్ కేసులో ఇరికించారని ఆ లేఖలో ఆరోపించాడు. 2 వారాల క్రితమే 12 పేజీల లేఖను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపించాడు. ఈ విషయం ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ ఆ లేఖలో పేర్కొన్నాడు. కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఏడీజీపీ సంధ్యా, ఎర్నాకుళం గ్రామీణ జిల్లా ఎస్పీ జార్జ్ కలిసి తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. వారే తనను అరెస్టు చేయించారని ఆరోపించాడు. ఈ కేసు విచారణ నుంచి డీజీపీ లోక్ నాథ్ బెహరా, ఏడీజీపీ సంధ్యా, ఎర్నాకుళం గ్రామీణ జిల్లా ఎస్పీ జార్జ్ ను తప్పించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఈ కేసులో ప్రధాన ముద్దాయి పల్సర్ సునీ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో దిలీప్ ను కుట్రపూరితంగా ఇరికించారని కొందరు రాజకీయ నాయకులు కూడా అతడికి బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసుకు రాజకీయ రంగు పులిమి దిలీప్ ను తప్పించాలని చూస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్ ఏకంగీ కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం, ఎస్పీ , డీజీపీలను తొలగించాలని డిమాండ్ చేయడం, సీబీఐ విచారణ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దిలీప్ లేఖ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ, ఆ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
2017 ఫిబ్రవరి 17వ తేదీన రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెలుతున్న ప్రముఖ నటిని పల్సర్ సునీ తదితరులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పల్సర్ సునీ ఇచ్చి న సమాచారంతో జులై 11వ తేదీన కేరళ పోలీసులు.... హీరో దిలీప్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. దిలీప్ నకు న్యాయస్థానం నాలుగు సార్లు బెయిల్ నిరాకరించింది. చివరికి అక్టోబర్ 3వ తేదీన హీరో దిలీప్ నకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, బయటకు వచ్చిన దిలీప్ తన కేసును సీబీఐతో విచారణ చేయించాలని అంటున్నాడు.