బాలీవుడ్ లో సెలబ్రిటీ జంటల్లో ఒకటి.. నాటి ప్రముఖ నటుడు దిలీప్ కుమార్.. ఆయన సతీమణి ప్రముఖ నటి సైరాభానులు. ఈ జంట తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని సాయం కోరుతూ ఒక లేఖ రాశారు. బిల్డర్ నుంచి తాము బెదిరింపులు ఎదుర్కొంటున్నామని.. తమ ఇంటిని తమకు ఇప్పించాల్సిందిగా వారు కోరుకుంటున్నారు. ఇంతకీ.. వారికి ఎదురైన ఇబ్బంది ఏమిటి? అన్నది చూస్తే..
ముంబయి నగరంలోని పాలి హిల్స్ లో దిలీప్ కుమార్.. సైరాభానులకు ఒక ఇల్లు ఉంది. దాన్ని రిపేర్లు చేయించి ఇవ్వాలన్న ఒప్పందం మీద ప్రతీజా డెవలపర్స్ కు అప్పగించారు. అయితే.. ఇంటిని రిపేర్ల కోసం అప్పగించిన తర్వాత వారు తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. బిల్డర్ ను తమ ఇంటిని తమకు తిరిగి ఇవ్వాలని కోరారు.
ఇందుకు బిల్డర్ నో అంటే నో అనేస్తున్నాడట. దీనిపై ఇప్పటికే తాము కోర్టుకు వెళ్లామని.. అక్కడ కూడా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వారు వెల్లడించారు. అయినప్పటికీ బిల్డర్ మాత్రం ఇంటిని తిరిగి ఇవ్వటం లేదని.. బదులుగా బెదిరింపులకు దిగుతున్నాడని వారు వాపోయారు. తమ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమ ఇంటిని తమకు ఇచ్చేలా చూడాలని వారు కోరుకుంటున్నారు. మరి.. వీరు రాసిన లేఖకు సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.