ముగిసిన రాయితీ చలాన్ల చెల్లింపులు..: ఇక వారికి చుక్కలే..?

Update: 2022-04-16 11:36 GMT
ట్రాఫిక్ చలాన్ల ఈ- లోక్ అదాలత్ శుక్రవారంతో ముగిసింది. మార్చి 1న మొదలైన ఈ కార్యక్రమంలో నెలరోజులు నిర్వహించాలని అనుకున్నా వినియోగదారుల కోరిక మేరకు గడువును మరో 15 రోజులు పెంచారు. దీంతో నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.92 కోట్ల మంది వాహనచోదకులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు రూ.300 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు వాహనాలపై ఉన్న చలాన్లు చెల్లించే విధంగా ట్రాఫిక్ పోలీస్ విభాగం 90 నుంచి 25 శాతం వరకు రాయితీ ఇవ్వడంతో చాలా మంది వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఈ అవకాశంలోనూ చలాన్లను చెల్లించని వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

నెలన్నర రోజుల పాటు రాయితీపై చెల్లించిన చలాన్లన్నీ ఎక్కువగా ద్విచక్రవానాలకు సంబంధించినవే ఉన్నాయి. అయితే పెండింగ్ చలాన్లలో 70 శాతం మాత్రమే క్లియరెన్స్ అయ్యాయని ఇంకా చెల్లించిన వారు ఉన్నారని పోలీసులు గుర్తించారు.అయితే కొన్ని వాహనాలు చేతులు మారడం.. మరికొన్ని అందుబాటులో లేకపోవడంతో వాటి చెల్లింపులు జరగలేదు. కానీ అందుబాటులో ఉన్నా ఈ చలాన్లను చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసుల రెడీ అవుతున్నారు.

పెండింగ్ చలాన్లు చెల్లించివారు పోగా మిగిలిన వారి డేటాను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వారి వాహనాలను నేరుగా లేదా తనిఖీల్లో గుర్తించనున్నారు. అలా గుర్తించిన వాహనాలను సీజ్ చేయడమా..? లేదా కేసు నమోదు చేయడమా..?అనేది నిర్ణయించనున్నారు. వీరిపై చలాన్లను భట్టి చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ విభాగం కోర్టుకు నివేదించనుంది. కోర్టు ఆదేశాలు వచ్చిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

అయితే మొన్నటి వరకు రాయితీ ఉన్నా చెల్లించని వారికి ఇప్పుడు పూర్తి మొత్తంతో పాటు అదనంగా చార్జీలు వేసే అవకాశం ఉందని అంటున్నారు. చలాన్ల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి జాబితాను తయారు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీఏ డేటా బేస్ వాహన చోదకుల వివరాలను సేకరిస్తున్నారు.

ఈ లోక్ అదాలత్ చెల్లిపుల నేపథ్యంలో ఓటీపీ తప్పనిసరి చేయడంతో వాహన చోదకులు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు తమ ఫోన్ నంబర్ ను పొందుపరిచారు. ఈ వివరాలను సంగ్రహించిన సర్వర్ ప్రత్యేక డేటా బేస్ రూపొందించింది. దీంతో ఈ చలాన్ ను వాట్సాప్ ద్వారా పంపే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
Tags:    

Similar News