అవును.. ఈ పంపకాలేంటో.. ఈ అప్పులేంటో.. ఇదీ.. ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారుపై జరుగుతున్న తీవ్రమై న చర్చ. ఇది ఎవరో టీడీపీ నాయకులో.. ప్రతిపక్షంలో గిట్టనివారో అనుకుంటున్న చర్చకాదు. సాక్షాత్తూ ప్రజల మధ్యే వస్తున్న చర్చ. ఒకవైపు.. వైసీపీ ప్రభుత్వం పింఛన్లు కోసేస్తోంది. నిజానికి జనవరి 1 నుంచి పింఛన్లను పెంచుతూ.. తీర్మానం చేసి.. పింఛన్ల దారుల్లో ఆనందాన్ని నింపారు సీఎం.
అయితే, ఆ వెంటనే ఇతర కారణాలు చూపుతూ.. ఆయా పింఛన్లకు కోత పెట్టారు. అయితే..దీనిపై రకరకా ల చర్చ సాగుతోంది. జగన్ సర్కారు అప్పుల్లో ఉన్నందునే.. సర్దు బాటు చేయలేక.. పించన్లకు కోత పెడు తోందనే చర్చజోరుగా సాగుతోంది.
ఇక, ఇలా పింఛన్లను ఎత్తేయడంపై.. జిల్లాల్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెద్ద ఎత్తున ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక, అంతర్గతంగా వైసీపీ నేతలు.. ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో చేస్తోందని.. అప్పులు లభించకే ఇలా చేస్తోందనే వాదనను వారు తెరమీదకి తెస్తున్నారు. దీంతో అంతో ఇంతో ప్రజల ను అనునయించాలని నాయకులు ప్రయత్నం అయితే.. చేస్తున్నారు. కానీ, ఇంతలోనే.. జగన్ సర్కారు తాజాగా మరో పంపకానికి రెడీ అయింది.
అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో.. అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్దిదారులకు 600 కోట్ల రూపాయలను పంచేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు.
నిజానికి వీరు ఎవరో.. ఎందుకు అర్హులు కాకపోయినా ఇస్తున్నారో.. తెలియదు. కానీ, ఇచ్చేస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు.. నిధులు లేవని.. పింఛన్లను తుంచుతూ.. మరోవైపు.. ఈ పంచుడేందనేది.. జనాల ప్రశ్న. మరిదీనికి వైసీపీ నేతలుఏం చెబుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.