తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ పదవీ కాలంపై తెలుగు రాష్ర్టాల్లో చర్చ మొదలైంది. నరసింహన్ పదవీ కాలం మే మూడో తేదీతో ముగుస్తోంది. దీంతో ఆయనకు పొడిగింపు ఇస్తారా లేక ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తారా? అనే విషయమై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఆంధ్ర - తెలంగాణతోపాటు తమిళనాడు - జమ్ముకాశ్మీర్ - మధ్యప్రదేశ్ - అరుణాచల్ ప్రదేశ్ - మేఘాలయ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించవలసి ఉంది. ప్రస్తుతం గవర్నర్ల నియామకానికి సంబంధించిన ఫైలు ప్రధాన మంత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకూ ఒకరే గవర్నరుగా ఉండటం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి.
ఏపీ విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు గతంలో నరసింహన్ ను రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగించారు. విభజన చట్టం అమలులో ఎదురైన మెజారిటీ సమస్యలు పరిష్కారమైనందున ఇక మీదట రెండు రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నరుగా కొనసాగించవలసిన అవసరం లేదని కేంద్రం భావిస్తోందని అంటున్నారు. కాగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు కొత్త గవర్నర్లను నియమించాలని కోరుతున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అంశంపై హోం శాఖ తయారు చేసిన నోట్ ప్రధాన మంత్రి పరిశీలనలో ఉన్నదని అంటున్నారు. నరసింహన్ ను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా కొనసాగించి రెండో రాష్ట్రానికి బీజేపీ సీనియర్ నేతను గవర్నర్ గా నియమించాలని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నట్లు తెలిసింది. 2019లో జరిగే లోక్ సభ - అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ-తెలంగాణలకు గవర్నర్లను ఎంపిక చేయాలని బీజేపీ సూచిస్తున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ ఈ నెలాఖరులో కొత్త గవర్నర్ల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని హోం శాఖ వర్గాల సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/