దిశ హత్య : ఫాస్ట్ ట్రాక్ కి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ..45 రోజుల్లోనే ఉరి ?
హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఎంతో ఎదిగిపోతున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్న దేశ నాయకులు ..ఇలాంటి మానవ మృగాళ్ల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే దిశ ని హత్య చేసిన ఆ నలుగురిని వెంటనే ఉరి తీయాలంటూ ప్రతి ఒక్కరు తమ నిరసన తెలుపుతున్నారు. పోలీసులు కేవలం ఈ కేసుని 24 గంటల్లోనే ఛేదించడం తో వెంటనే ఆ నిందుతులకి ఉరి శిక్ష అమలు చేసి .. మరోసారి ఎవరైనా ఇలాంటి ఘాతుకాలకి పాల్పడకుండా భయపడేలా చేయాలనీ కోరుతున్నారు.
ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరగా విచారణ పూర్తీ చేసి .. నిందుతులకి తగిన శిక్షని వేయాలని చూస్తుంది. ఇందులో భాగంగా ..ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకి నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై హైకోర్టు స్పందించి, కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్టు బుధవారం తెలిపింది. సాధారణ కోర్టుల వల్ల సమయం ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హై కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుపై రాష్ట్ర న్యాయశాఖ కసరత్తు ప్రారంభించింది. మహబూబ్ నగర్ కోర్టులో ఒక కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేస్తారా.. లేదంటే షాద్ నగర్ కోర్టునే ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా చేసి విచారణ చేపడుతారనే అంశంపై ఒకటి, రెండురోజుల్లో క్లారిటీ వస్తోంది. ఇక మరోవైపు దిశ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నారు. శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సీన్ ఆఫ్ ఎఫెన్స్, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని బలమైన ఆధారాలు కోర్టులో ప్రవేశపెట్టి.. వారికి ఉరి శిక్ష విధించేలా చార్జీషీట్ రూపొందిస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
గతంలో వరంగల్‌లో చిన్నారిపై కీచకుడు ప్రవీణ్ లైంగికదాడిపై నిరసనలు ఎక్కువైనా నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ..కేవలం 60 రోజుల్లో విచారణ పూర్తీ చేసి , ఉరి శిక్ష వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దిశ విషయంలో కూడా 45 రోజులకు మించకుండా నిందితులకు ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది.