అమెజాన్ లో మొదలైన ఉద్యోగుల తొలగింపు.. రెండు నెలల టైం

Update: 2022-11-17 06:43 GMT
ట్విటర్, మెటా బాటలోనే అమెరికా ఈకామర్స్ దిగ్గజం 'అమెజాన్' కూడా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. సంస్థలో ఇకపై కొన్ని రకాల ఉద్యోగాలు అవసరం లేదని నిర్ణయించినట్టు కంపెనీ చీఫ్ సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఇది కఠినమైన నిర్ణయం అయినప్పటికీ తపడం లేదంటూ చెప్పుకొచ్చాడు.

అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలో కనీసం కొన్ని వందల ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తొలగింపు ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది.  

"ఫేస్‌బుక్-పేరెంట్ సంస్థ మెటా ఇతరులతో పోలిస్తే తొలగింపులు సాపేక్షంగా ఎక్కువగా ఉండవచ్చు" సమాచారం. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు సమాచారం.దీనివల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులకు కొత్త పని వెతుక్కోవడానికి కావాల్సిన సహకారం కూడా అందిస్తామని కంపెనీ హెడ్ లు తెలిపారు. అయితే ఎంత మందిని తొలగించనున్నది మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు.

దాదాపు 10వేల మంది ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. చాలా లోతైన సమీక్షల తర్వాత కొన్ని విభాగాలు, ప్రాజెక్టులను స్థిరీకరించాలని నిర్ణయించాం. దీని పర్యావసనంగా కొన్ని రకాల ఉద్యోగాలు సంస్థకు ఎప్పటికీ అవసరం లేదని తేల్చాం.

ఈ నిర్ణయం వల్ల ప్రతిభ కలిగిన కొంతమంది ఉద్యోగుల్ని కోల్పోవాల్సి వస్తోంది.  అని కంపెనీ హెడ్ లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి కావాల్సిన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ప్రధానంగా డివైజెస్, రిటైల్ , హ్యుమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగాల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మేనేజర్లు ఆయా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. రెండు నెలల్లోగా ప్రత్యామ్మాయం చూసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. కొత్త నియామకాలు చేపట్టడాన్ని కూడా నిలిపివేసినట్లు ఇటీవలే అమెజాన్ అధికారులు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News