రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన అధిస్థానం సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి.
జిల్లాకు చెందిన ముఖ్యనాయకురాలు, మాజీ ఎమ్మెల్యేలు డీకె అరుణ - చిన్నారెడ్డి - సంపత్ - వంశీల మధ్య వాడీ వేడి చర్చ సాగింది. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని డీకే అరుణను ఏఐసీసీ నేత కుంతియా అడిగారు. కానీ తాను పోటీ చేయలేనని ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయానని తెలిపింది. తన బదులు జైపాల్ రెడ్డితో పోటీ చేయించాలని పేర్కొంది. కానీ కాంగ్రెస్ నేతలు ఆయనతో పోటీ చేయించడానికి సుముఖంగా లేరు. ఇక్కడి నుంచి జైపాల్ రెడ్డి పోటీ చేయడం కుదరదని స్ఫష్టం చేశారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్.
దీంతో ఉత్తమ్ పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బాగున్నప్పుడు పోటీకి వస్తారు గానీ.. కష్టకాలంలో పోటీ చేయరా..? అని నిలదీశారు. జైపాల్ రెడ్డి గెలిస్తే మల్లిఖార్జున ఖర్గే స్థాయిలో ఉంటారని - కానీ ఆయన సమావేశంలో లేనప్పుడు ఆయన గురించి మట్లాడడం సరికాదన్నారు మరో నేత చిన్నారెడ్డి. మరి అంతపెద్ద నాయకుడు పోటీచేయడానికి ఎందుకు వద్దంటున్నారని - పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్ద నాయకులే అండగా ఉండాలని డీకే అరుణ బదులిచ్చారు.
అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ సీటుపై డీకే అరుణ - సంపత్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం ఎంపీ నంది ఎల్లయ్యకు డీకే అరుణ మద్దతు పలికారు. నంది ఎల్లయ్యకు టికెట్ ఇవ్వకపోతే సతీష్‌మాదిగ పేరు పరిశీలించాలని కోరారు. ఈ ప్రతిపాదనపై మాజీ ఎమ్మెల్యే సంపత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలోని సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి గానీ.. కొత్తగా వచ్చిన వారికి ఎంపీ స్థాయి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి అసెంబ్లీ టికెట్లు - ఏఐసీసీ పదవులు ఇచ్చినప్పుడు ఎంపీ సీటును ఇవ్వడంలో ఎందుకు అభ్యంతరమని డీకే అరుణ కౌంటర్ ఇచ్చారట...
ఈ వ్యవహారంపై ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జి కుంతియా జోక్యం చేసుకొని డీకే అరుణ పీసీసీలో సభ్యురాలు అయినందున తను ఎవరి పేరునైనా సూచించవచ్చన్నారు. దీనికి ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మొత్తానికి పార్లమెంట్ టికెట్ పై జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుల్లోని బేధాభ్రియాపాలు బయటపడ్డట్టాయి. అసలే ఎన్నికల్లో ఓడిపోయి కుదేలైన నేతలు కలిసికట్టుగా పోరాడాల్సిందిపోయి కొట్టుకోవడం టీకాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. .