డీఎల్ నోట‌ ప‌వ‌ర్ పంచ్!... భ‌లే పేలింద‌బ్బా!

Update: 2019-03-29 11:41 GMT
డీఎల్ ర‌వీంద్రారెడ్డి... తెలుగు నేల‌లో సీనియ‌ర్ పొలిటీషియ‌న్ గానే కాకుండా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే నేత‌గా పేరుంది. ప‌ద‌వుల కోస‌మో, ఇంకేదేని కోస‌మో అర్రులు చాచ‌కుండా త‌న‌దైన మార్క్ బాట‌లో ప‌య‌నించే నేత‌ల్లో డీఎల్ కూడా ఒక‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నేప‌థ్యంలో రాజ‌కీయంగా స్త‌బ్దుగా మారిపోయిన డీఎల్‌... కొత్త ర‌క్తంతో పోటీ ప‌డ‌లేన‌ని దాదాపుగా తేల్చేసుకున్నారు.

అయితే ఆయ‌న‌ను న‌మ్ముకుని ఉన్న వ‌ర్గం ఒక‌టి ఉంటుంది క‌దా. ఈ నేప‌థ్యంలో ఆ వ‌ర్గానికి న్యాయం చేసేందుకు రాజ‌కీయాల్లో కొన‌సాగుదాములే అంటూ ఆయ‌న చాలానే య‌త్నాలు చేశారు. ఏకంగా టీడీపీలో చేరేందుకు కూడా ఆయ‌న సిద్ధ‌మైపోయారు. అయితే సీఎం చంద్ర‌బాబు నివాసం వ‌ద్ద త‌న‌కు ఎదురైన అనుభవంతో బ్యాక్ స్టెప్ వేశారు. ప‌ద‌వులే కావాల‌ని తాను రాలేద‌ని, అయితే క‌నీసం సీనియారిటీకి ఇచ్చే గౌర‌వం కూడా లేక‌పోతే ఎలాగంటూ డీఎల్ చేసిన వ్యాఖ్య‌లు నాడు పెను క‌ల‌క‌ల‌మే రేపాయి.

మొత్తంగా ఏ విష‌యంలో అయినా రాజీ లేని ధోర‌ణితోనే ముందుకు సాగుతార‌ని డీఎల్ కు మంచి పేరే ఉంది. అలాంటి డీఎల్ నోట ఇప్పుడు ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌ లు దూసుకువ‌స్తున్నాయి. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య త‌ర్వాత వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కుటుంబానికి కాస్తంత మ‌ద్ద‌తుగా నిలిచిన డీఎల్‌.... ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీకి మ‌ద్దతుగా ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మైపోయారు. ఈ క్ర‌మంలో నేడు మైదుకూరులో వైసీపీ నిర్వ‌హించిన ప్ర‌చారంలో పాలుపంచుకున్న డీఎల్‌... జ‌గ‌న్ స‌త్తా ఏమిట‌న్న విష‌యంపై త‌న‌దైన శైలి పంచ్‌ లు విసిరారు.

ఆ పంచ్  ఎలా సాగింద‌న్న విష‌యానికి వ‌స్తే... *సాధారణంగా గ్రామాల్లో మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరు మనుషులు కలిస్తే... నువ్వు నేను కలిస్తే...మనం అంటాం. అలాగే మనం... మనం కలిస్తే.... జనం అంటారు. ఇలాంటి జనం అంతా రాష్ట్రంలో కలిస్తే జగన్‌. అంటే జనం జ‌నం క‌లిస్తే జ‌గ‌న్‌’’ అని డీఎల్ త‌న‌దైన శైలిలో ప్ర‌సంగం చేశారు. అస‌లు ఎన్నిక‌ల ప్ర‌చారానికే రార‌నుకున్న డీఎల్ ప్ర‌చార ర‌థంపై క‌నిపించ‌డం, జ‌గ‌న్ స్టామినాపై ప‌వ‌ర్ ఫుల్ పంచ్‌ లు సంధించ‌డం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
   

Tags:    

Similar News