అనుకున్నట్టే జరుగుతోంది. ఆల్రెడీ కాంగ్రెస్ కు సన్నిహితంగా మెలుగుతూ ఉన్న స్టాలిన్ ఎంత మేరకు ఫెడరల్ ఫ్రంట్ కు సపోర్ట్ గా వస్తారు? అనే ప్రశ్న అనేక మందిలో కలిగింది ఇది వరకే. ఈ నెల పదమూడున చెన్నై వెళ్లి అక్కడ డీఎంకే ముఖ్య నేత స్టాలిన్ తో కేసీఆర్ సమావేశం అవుతున్నాడనే వార్త మొదట్లోనే ఆశ్చర్య పరిచింది. ఎందుకంటే… ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమిళనాట కాంగ్రెస్ – డీఎంకేలు కలిసి పోటీ చేశాయి.
అంతేనా.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటూ స్టాలిన్ ప్రతిపాదించారు కూడా. రాహుల్ ను పీఎం పోస్టుకు అభ్యర్థిగా ప్రతిపాదించిన మొదటి కాంగ్రెస్ యేతర వ్యక్తి కూడా స్టాలినే! అలాంటి స్టాలిన్ కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వస్తాడనే నమ్మకం ఎవరి లోనూ లేదు.
ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ వెళ్లి కలిసినా ప్రయోజనం ఏమిటి? అనేది చర్చనీయాంశంగా నిలిచింది. అయితే కథ అంత వరకూ కూడా వెళ్లలేదు. ఈ నెల పదమూడున కేసీఆర్ స్టాలిన్ తో సమావేశానికి ప్రయత్నించగా.. అందుకు డీఎంకే నుంచి సమ్మతి రాలేదని సమాచారం.
కేసీఆర్ తో సమావేశానికి పెద్దగా ఆసక్తి లేని స్టాలిన్ - ఎన్నికలను సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నారట. తమిళనాట కొన్ని అసెంబ్లీ సీట్లకు ఇంకా పోలింగ్ తతంగం ఉంది. చివరి విడత పోలింగ్ లో భాగంగా వాటిల్లో ఓటింగ్ జరగనుంది. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని.. ప్రస్తుత పరిస్థితుల్లో కలవడానికి తీరిక లేదని తెలివిగా సమాధానం ఇచ్చిందట డీఎంకే.
దీంతో చేసేది లేక స్టాలిన్ తో సమావేశానికి తేదీ ఖరారు కాలేదని తెలంగాణ రాష్ట్ర సమితి డ్యామేజ్ కంట్రోల్ కు దిగిందని సమాచారం!