సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూ పెద్ద ఐటెమ్ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తమిళనాడు బీజేపీలోని హీరోయిన్లు బఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వీరందరిలోకి ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ తన వాచాలతను ప్రదర్శించారు. అమిత్ షా తలమీద వెంట్రుకైనా మొలుస్తేందేమో కానీ.. తమిళనాడులో మాత్రం కమలం (బీజేపీ గుర్తు) మాత్రం వికసించదన్నారు.
డీఎమ్‌కే నేత ఘాటు వ్యాఖ్యలపై సినీ నటి ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆ పార్టీ మహిళా నేత, కరుణానిధి కుమార్తె, ఎంపీ అయిన కనిమొళిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. డీఎంకే రూల్‌లో మహిళలపై ఇంత నీచంగా ఎలా మాట్లాడతారని నిలదీశారు.
మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే.. వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో అర్థమవుతుందని ఖుష్బూ మండిపడ్డారు. ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారని ధ్వజమెత్తారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి? డీఎంకే రూల్ అని ట్విటర్ వేదికగా ఖుష్భూ తీవ్ర విమర్శలు చేశారు.
దీంతో నష్టనివారణ చర్యలకు దిగారు.. డీఎంకే ఎంపీ, ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరి.. కనిమొళి. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేత సైదైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నానని కనిమొళి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని ఆమె తెలిపారు. ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బు ట్వీట్‌కు ఆమె బదులిచ్చారు.
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే నేత సైదైయ్ సాదిక్ కూడా క్షమాపణలు చెప్పారు. ఎవరినీ బాధపెట్టాలని తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. కుష్బూతో సహా ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.
తనను తప్పబడుతున్నవారు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అన్నారని.. జర్నలిస్టులను కోతులతో పోల్చాడని సాదిక్ గుర్తు చేశారు. మరి తనను క్షమాపణలు కోరుతున్న ఈ బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని సైదైయ్ సాదిక్ ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.