గతంలో ఏదైనా పరిణామం చోటు చేసుకోవటానికి కాస్త సమయం పట్టేది. ఇప్పుడంతా మారిపోయింది. గంటల వ్యవధిలో హీరో కాస్తా జీరోలు అయిపోతున్నారు. దీనికంతటికి కారణం.. సోషల్ మీడియానే. సెలబ్రిటీల మొదలు సామాన్యుల వరకు నేరుగా సంబంధాల్ని నెరుపుతున్న సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏ గంటకు ఆ గంటకు లెక్కలు తేలిపోతున్నాయి. ప్రముఖులు చేసే చిలిపి పనులే కాదు తప్పుడు పనుల్ని నిర్మోహమాటంగా వేలెత్తి చూపించటమే కాదు.. తప్పు చేసిన వారిని కడిగి పారేస్తున్నారు నెటిజన్లు. రైతుల ఉద్యమం నేపథ్యంలో గడిచిన రెండు రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే.
ఎప్పుడూ లేనిది.. ఏ ఉద్యమ సమయంలోనూ పట్టనట్లుగా వ్యవహరించిన విదేశీ సెలబ్రిటీలు.. ప్రముఖులు.. తాజాగా చేస్తున్న రైతు ఉద్యమంపై స్పందిస్తున్నారు. భారత్ లో జరుగుతున్న రైతు దీక్షలకు అక్కడెక్కడో అల్లంతదూరాన ఉన్న ప్రముఖులకు రైతుల ఉద్యమం మీద స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. నిజానికి భారతదేశంలోఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? రైతు నిరసనలు ఏ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి? లాంటి బేసిక్ క్వశ్చన్లు వేసినా సమాధానం చెప్పలేని సెలబ్రిటీలు.. ప్రముఖులకు ఉన్నట్లుండి భారత రైతుల మీద అంత సానుభూతి ఏమిటన్నది సందేహం?
ఇదంతా ఎలా జరుగుతోంది? దీనికి వెనుక ఎవరున్నారు? అన్నది ప్రశ్న. నిజానికి ఇప్పుడు జరుగుతున్న రైతుల దీక్షకు పంజాబ్.. హర్యానా.. ఉత్తరప్రదేశ్ లోని కొంత భాగం మాత్రమే తీవ్రంగా ప్రభావితమైంది. దక్షిణాదిన దాని గురించి వచ్చే వార్తల్ని చదవటం తప్పించి.. పెద్దగా రియాక్టు అవుతున్నది లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వామపక్ష వాదులు.. వారి సానుభూతిపరులు.. మద్దతుదారులు రైతు దీక్షల్లో పాల్గొంటున్నారు. మోడీ మీద తమకున్న వ్యతిరేకతను ప్రదర్శించుకోవటానికి.. రైతు దీక్షలు ఒక ఆయుధంగా వారు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దేశీయ ప్రముఖులు.. సెలబ్రిటీలు రంగంలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. రైతు దీక్షకు మద్దతుగా మాట్లాడి.. కేంద్రంలోని మోడీ సర్కారును ఇరుకున పెట్టేలా ట్వీట్లు చేస్తున్న సెలబ్రిటీలకు.. దేశీయ సెలబ్రిటీలు.. ప్రముఖులు రీట్వీట్లు చేస్తూ పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్నారు. ఇదంతా చూసినప్పుడు.. ఎవరో నడుపుతున్న నాటకానికి పలువురు పాత్రధారులవుతున్నారన్న భావన కలుగక మానదు. దేశీ.. విదేశీ సెలబ్రిటీల నడుమ నడుస్తున్న ట్వీట్ల వార్ తాజాగా మరో మలుపు తిరిగింది.
దేశీయంగా మోడీ సర్కారుకు అనుకూలంగా.. విదేశీ సెలబ్రిటీ ట్వీట్లకు పంచ్ లు వేస్తున్న వారికి షాకిచ్చే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏక్తాకపూర్.. అజయ్ దేవగన్.. అక్షయ్ కుమార్.. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ ప్రముఖులు సోసల్ మీడియాలో ఇండియా టుగెదర్ అనే నినాదాన్ని ప్రచారం చేస్తూ.. రైతు ఉద్యమాన్ని సాకుగా చూపించి.. విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇండియా టుగెదర్ లో భాగంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్లు రెండూ ఒకేలా ఉండటం.. పొల్లు కూడా తేడా లేకపోవటం ఇప్పుడు కొత్త రచ్చగా మారింది.
దీంతో.. నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తించి.. విరుచుకుపడుతున్నారు. అంతేకాదు.. బాలీవుడ్ సెలబ్రిటీలు చేస్తున్న ట్వీట్లు.. ఒకే మాదిరిగా ఉండటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు. దీంతో.. ట్వీట్ల వార్ వెనుక మరేదో జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇప్పుడు వస్తున్న ట్వీట్లు మొత్తం పెయిడా? ఫేకా? లేదంటే వ్యూహాత్మకంగా తెర మీదకు తెస్తున్నవా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించాల్సి వస్తోంది. ఇదే సమయంలో మోడీ బ్యాచ్ కు కాస్త వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు కొత్త ఉత్సాహంతో ట్వీట్లు చేస్తున్న వైనం చూస్తే.. రైతుల దీక్ష పేరుతో సాగుతున్న పోరు.. సోషల్ మీడియాసాక్షిగా ఓ రేంజ్లో సాగుతుందని చెప్పక తప్పదు. ఇప్పడు చెప్పండి.. దేశీ.. విదేశీ ట్వీట్ల వెనుక ఎవరున్నట్లు..?