మహిళలకే 'కష్టాలు'.. అధ్యయనంలో వెల్లడి..!

Update: 2023-01-11 06:50 GMT
స్త్రీ లేకపోతే పురుషుడు లేడు.. పురుషుడు లేకపోతే పుట్టక లేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ కాదు.. ఎవరు తక్కువ కాదు. అయినా సమాజంలో స్త్రీలు అంటే పురుషుడి కంటే తక్కువ అనే భావన ఉంది. అన్ని ప్రాంతాల్లో కాకపోయిన మెజార్టీ ఏరియాలో మాత్రం ఇప్పటికే ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

చైనాలోని లాన్ ఝౌ విశ్వవిద్యాలయం సహకారంతో యూనివర్సిటీ కాలేజ్ లండన్ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ జీవన విధానంపై అధ్యయనం చేశారు. ఈ విషయాలను ‘కరెంట్ బయాలజీ’ అనే జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ప్రపంచంలో నాలుగు రకాల వైవిధ్య జీవన సంస్కృతులు కలిగిన టిబెటన్ సరిహద్దుల్లోని చైనా గ్రామీణ ప్రాంతాల్లో లండన్ విద్యార్థులు పరిశోధన చేయగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తమ కుటుంబాల కోసం పురుషుల కంటే మహిళలే అధికంగా శ్రమిస్తున్నట్లు ఆ పరిశోధనలో వెల్లడైంది. మహిళలు సగటున రోజుకు 12 వేల అడుగుల మేర నడుస్తుంటే.. పురుషులు 9వేల అడుగులు నడుస్తున్నారని తేలింది. మహిళలతో పోలిస్తే పురుషుల శ్రమ కొంత తక్కువ అని వెల్లడైంది. మహిళలతో పోలిస్తే సామాజిక కార్యక్రమాల్లో పురుషులు ఎక్కువగా విరామం తీసుకుంటున్నారని తేలింది.

వివాహ బంధంతో వేరే ఇంటికి వెళ్లే మహిళలు తన పుట్టింటిని విడిచి పెడుతున్నామనే బాధతో పాటుగా ఎక్కువ పని భారం మోయాల్సి వస్తుందని అధ్యాయనంలో వెల్లడైంది. ఇక భార్య భర్తలు ఇద్దరు పుట్టిల్లు వదిలే వేరుగా ఉంటున్న జీవనంలో ఇద్దరికీ శ్రమ భారం ఎక్కువగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి మాత్రం మహిళల పైనే ఎక్కువగా పడుతోందని తేలింది.

పురుషులు పుట్టిల్లు వదిలే వివాహ వ్యవస్థలో మాత్రం పని భారంలో స్త్రీ.. పురుషుల మధ్య సమానత్వం ఉన్నట్లు వెల్లడైంది. ఈ విధానంలో పురుషులు సగటున 2వేల అడుగులు అదనంగా నడవాల్సి వస్తే మహిళలు వెయ్యి అడుగులు ఎక్కువగా నడవాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల పైనే ఎక్కువ పని భారం ఉంటుందని అధ్యయనంలో తేలింది.

సంపన్న కుటుంబాలు.. పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు తక్కువగానే ఉన్నాయని పరిశోధన విద్యార్థులు వివరించారు. పట్టణాలల్లో శారీరక శ్రమ చేసే జీవన విధానంగా క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. పని భారం విషయంలో స్త్రీ.. పురుష సమానత్వం లేదని వివరించారు. కాగా భర్తను.. కుటుంబాలను వదిలి వేరుగా జీవిస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరిగిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడి కావడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News