అధిక పనిగంటల వల్ల ఏడాదికి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

Update: 2021-05-21 00:30 GMT
స్మార్ట్ కాలంలో మానసిక ఆందోళనలు, పని ఒత్తిడిలు సర్వసాధారణమయ్యాయి. ఈ క్రమంలో అధిక పని ఒత్తిడితో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చేయాల్సిన దానికన్నా ఎక్కువ పనిగంటల వల్ల ఏటా లక్షల మంది మృత్యు ఒడికి చేరుతున్నారని డబ్యూహెచ్వో వెల్లడించింది. రోజుకు నిర్ణీత సమయం కన్నా ఎక్కువ సేపు పనిచేస్తే గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

అధిక పని గంటల కారణంగా 2016లో 7,45,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఓ అంతర్జాతీయ సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా తొలిసారి నిర్వహించి ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సౌత్, ఈస్ట్, ఆసియా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అధిక పని గంటల వల్ల తీవ్ర దుష్ర్పభావాల బారిన పడుతున్నారని సర్వేలో వెల్లడించారు. ఈ కారణంగా మరణించేవారిలో మూడొంతుల మంది మధ్యవయస్కులు, ఆపైబడిన వారే ఉన్నారని పేర్కొంది.

సాధారణంగా వారంలో 35 నుంచి 40 గంటలు పనిచేయాలని సూచించింది. అలాకాకుండా వారానికి 55 గంటలు పనిచేస్తే ఇలాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అధిక పని గంటల కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం 35 శాతం ఉందని వెల్లడించింది. ఈ పనిగంటల ప్రమాదం వెంటనే కాకుండా దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని తెలిపింది.

లాక్ డౌన్ కారణంగా దాదాపు 10శాతం అధిక పని గంటలు పెరిగాయని వెల్లడించింది. కాగా ఇంటి నుంచి పని విధానంలోనూ ఎక్కువ పని చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఉద్యోగాల అనారోగ్యం అధిక పనిగంటల వల్లే ఎక్కువ అవుతుందని డబ్లూహెచ్వో స్పష్టం చేసింది. ఈ విధానం యాజమాన్యాలకు లాభదాయకమేనని వెల్లడించింది. కానీ ఉద్యోగుల ఆరోగ్యం ముఖ్యమేనని తెలిపింది. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు పనిగంటలు పెంచకూడదని సూచించింది.
Tags:    

Similar News