అయోధ్య రామమందిరానికి పవన్ ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?

Update: 2021-01-22 10:40 GMT
కమ్యూనిస్టు భావజాలంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 'చేగువేరా'లా విప్లవభావాలు పలికించి.. గత ఎన్నికల్లో కమ్యూనిస్టులతో జట్టు కట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ దారుణ ఓటములతో ఏపీ రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తిన్నారు  అయితే పవన్ తిట్టిన బీజేపీనే కేంద్రంలో అధికారంలోకి రావడంతో తన స్టాండ్ మార్చుకొని అదే పార్టీని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీతో కలిసి ముందుకెళుతున్నారు. ఆ బీజేపీ హిందుత్వంను కూడా ఈ కమ్యూనిస్టు యోధుడు ఓన్ చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో రాజకీయ సభల్లో పాల్గొంటున్నారు.  అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి  పవన్ కళ్యాణ్  విరాళం ప్రకటించారు. రామ్ మందిర్ ట్రస్ట్‌కు రూ .30 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు. రామ్ మందిరాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని పవన్ అన్నారు. ఇది తన విరాళం అని ఆయన అన్నారు. పవన్ సహచరులు .. జనసేన పార్టీ నాయకులు - క్రైస్తవులు, ముస్లింలతో సహా వివిధ మతాలకు చెందిన వారు కూడా విరాళాలు అందించారు. ఈ రెండు చెక్కులను  సంబంధిత వ్యక్తులకు పవన్ కళ్యాణ్ అందజేశారు.

విరాళం ప్రకటించినప్పుడు.. పవన్ శ్రీరాముడి పట్ల తన ప్రేమను, భక్తిని వ్యక్తం చేశాడు. రాముడు ధర్మానికి ప్రతీక అన్నారు. అనేక దాడులకు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ ఈ శతాబ్దాలుగా భారతదేశం ఒక దేశంగా బలంగా ఉందని పవన్ అన్నారు. ఈ భూమిలో శాంతి కోసం కృషి చేసిన రాముడిది గొప్ప ఘనత అన్నారు.. రామా పాలన పౌరులలో సహనాన్ని నింపిందని ఆయన అన్నారు. భారతదేశం ఐక్యతలో వైవిధ్యం ఉన్న దేశం అని.. ఇక్కడ అన్ని మతాల ప్రజలు శాంతి.. సామరస్యంతో జీవించాలని పవన్ అన్నారు.

ఈ మీడియా సమావేశానికి ముందు, పవన్ తిరుమల సందర్శించి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. టాలీవుడ్లోనే అయోధ్య రామాలయానికి విరాళం ఇచ్చిన హీరోలలో పవన్ మొదటివాడు.. ఏపీలో రాజకీయ నాయకుల్లో కూడా అయోధ్య రామ్ మందిరానికి సహకరించిన కొద్దిమందిలో ఒకడిగా నిలిచాడు.
Tags:    

Similar News