తిరుమ‌లః శ్రీవారి ద‌ర్శ‌న స‌మ‌యం ఎంతో తెలుసా?

Update: 2021-05-17 05:33 GMT
క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో అవ‌గాహ‌న ఉన్న‌వాళ్లంద‌రికీ తెలిసిందే. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ సాధారణం అని వార్త‌లు వ‌చ్చేట‌ప్పుడు కూడా స‌గ‌టు భ‌క్తుడు స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి 5 నుంచి 6 గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది. ఇదే సాధార‌ణ స‌మ‌యం. ఇంత‌కు మించి త‌గ్గే ఛాన్స్ ఉండేదే కాదు. అలాంటిది.. క‌రోనా ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో.. తిరుమ‌ల బోసిపోయి క‌నిపిస్తోంది.

దీనికి కారణం.. స‌గం దేశం లాక్ డౌన్లో ఉండ‌డ‌మే. దేశంలోని దాదాపు 15 రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొన‌సాగుతోంది. మిగిలిన రాష్ట్రాల్లో ఆంక్ష‌ల‌తో కూడిన క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంది. దీంతో.. ఇత‌ర రాష్ట్రాల నుంచి తిరుమ‌ల‌కు వ‌చ్చే వారు పూర్తిగా బందైపోయారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దైవ ద‌ర్శనాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో.. తిరుమ‌ల ద‌ర్శ‌నం చాలా సింపుల్ గా జ‌రిగిపోతోంది.

ప్ర‌స్తుతం ఏపీలో ఆంక్ష‌ల‌తో కూడిన కర్ఫ్యూ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి మాత్రం ఎలాంటి ఆంక్ష‌లూ లేవు. రోజుకు 20 వేల మందికి ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ.. నాలుగు నుంచి ఐదు వేల మంది మాత్ర‌మే వ‌చ్చి వెంక‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకుంటున్నార‌ట‌.

చిత్తూరు జిల్లా ప‌రిస‌రాల్లో ఉన్న భ‌క్తులు మాత్ర‌మే వెళ్లి వ‌స్తున్నార‌ట‌. దీంతో.. ద‌ర్శ‌నానికి వెళ్లిన వారంతా కేవ‌లం పావు గంట నుంచి అర‌గంట లోపే శ్రీవారిని ద‌ర్శించుకొని వ‌చ్చేస్తున్నార‌ట‌. సాధార‌ణ స‌మ‌యంలో ఇది వీవీఐపీ ద‌ర్శ‌నంతో స‌మానం. భ‌క్తులు త‌క్కువ‌గా ఉండ‌డంతో.. క్యూలైన్ల నుంచి కాకుండా.. సింహ ద్వారం నుంచే లోనికి అనుమ‌తిస్తున్నార‌ట‌. దీంతో.. అంద‌రూ ప్ర‌శాంతంగా ద‌ర్శ‌నం ముగించుకొని వ‌చ్చేస్తున్నారు.
Tags:    

Similar News