ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా?

Update: 2022-08-31 05:36 GMT
వినాయకుడు.. మన ఆది దేవుడు.. పూజలన్నింటిలోనూ వినాయకుడికే తొలి పూజ చేయడం మన సంప్రదాయం. అలాంటి వినాయకుడికి దేశంలో చాలా దేవాలయాలున్నాయి. అయితే ప్రపంచంలోనే అది పెద్ద వినాయక విగ్రహం భారత్ లో లేదన్న సంగతి మీకు తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం థాయ్ లాండ్ లో ఉంది. 'చాచోఎంగ్సావో ప్రావిన్స్' అనే ప్రాంతంలో ఉన్న రెండు వినాయకుడి విగ్రహాలు ప్రపంచంలోనే అతిపెద్దవి.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాల్లో ఒకటి 49 మీటర్ల ఎత్తు, 19 మీటర్ల వెడల్పుతో ఉండగా.. మరొకటి 98 అడుగుల కాంస్య విగ్రహం ఉంది. థాయిలాండ్ ప్రజలు వినాయకుడిని 'ఫ్రా ఫికానెట్' అని పిలుస్తారు. అక్కడ ఉన్న బౌద్దులు కూడా వినాయక చవితిని జరుపుకుంటారు.

థాయిలాండ్ ముస్లిం కంట్రీ అయినా కూడా అక్కడ ప్రజలు, ప్రభుత్వాలు తమ మూలాలను మరిచిపోరు. ఇక్కడ బౌద్దుల జనాభా కూడా ఉంటుంది. సోంసావలీ ఫ్రవర రజతినుద్దమత్ అనే థాయి రాజు హయాంలో అతిపెద్ద గణేష్ విగ్రహాన్ని నిర్మించారు. అంతకు ముందున్న వారసత్వాన్ని ఇప్పుడక్క కంటిన్యూ చేస్తున్నారు.

భారత్ నుంచి సంస్కృతి సంప్రదాయాలు, మేధో వలసలు అన్నీ భారత్ నుంచే జరగడంతో అక్కడ భారతీయత వర్ధిల్లింది. ఆసియా ఖండం అంతటా ముఖ్యంగా దక్షిణాసియాలోని కంబోడియాలో కూడా భారతీయ రాజులు పాలించి మనసంస్కృతికి నిలువుటద్దంలా విగ్రహాలు, ఆలయాలు నిర్మించారు.

థాయిల్యాండ్లో ఉన్న మూడు పెద్ద సైజు వినాయకులను దర్శించుకునేందుకు నవరాత్రుల టైంలో పెద్ద ఎత్తున పర్యాటకులు క్యూ కడుతారు. ఇండియాలో ఇలా జరగడం కామన్. కానీ ముస్లిం దేశంలో ఇలాంటి మతసామరస్యాన్ని మెచ్చుకోవాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News