ఆఫీసు టాయిలెట్ లో ఎక్కువ సేపు ఉంటున్నారా..? అయితే జాగ్రత్త!

Update: 2021-04-17 03:13 GMT
ఆఫీసు టాయిలెట్ లో ఎక్కువ సేపు గడుపుతున్నారా? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే... సహజంగా ఆఫీసులో పని వేళలు ఉంటాయి. ఇన్ని గంటలు పని చేయాలనే నిబంధనలు దాదాపు అన్ని సంస్థలు విధిస్తాయి. ఇక లంచ్, టీ బ్రేక్ సమయాన్ని లెక్కించినా టాయిలెట్ విషయంలో మాత్రం ఏ కంపెనీ అలా చేయదు. కానీ ఉద్యోగికి ఉన్న అలవాటు కారణంగా ఆ కంపెనీ పెద్ద షాక్ ఇచ్చింది.

తైవాన్ కు చెందిన ఓ ఉద్యోగికి టాయిలెట్ లో ఎక్కువ సేపు గడపడం అలవాటు. రోజూ అతడు అలా చేయడం చూసిన ఆ కంపెనీ పని దినాలను పరిశీలించింది. సీసీ కెమెరాల్లో రికార్డైన సమాచారం ఆధారంగా అతడు టాయిలెట్ లో గడిపిన సమయాన్ని లెక్కించి వేతనంలో కోత విధించింది. కంపెనీ ఈ చర్యను చూసి బాధితుడు షాకయ్యారు. ఇక తనలోని బాధనంతా సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు.
 
మార్చిలో 22 రోజుల్లో మొత్తం 195 గంటలు పనిచేశానని పేర్కొన్నారు. గంటకు సంస్థ 160 యువాన్ (రూ.1826) చొప్పున చెల్లిస్తోందని... జీతంలో 4,400 యువాన్ (రూ.50,198) కోత విధించిందని వాపోయారు. ఇలా చేయడం చాలా అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రోజులో ఒక గంట మాత్రమే టాయిలెట్‌కు యాజమాన్యం సమయం ఇస్తుందని, కాబట్టి తాను 27.5 గంటలు మాత్రమే టాయిలెట్లో ఉన్నట్లు అని వివరించారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాను ఏం చేయాలో చెప్పాలని నెటిజన్లు కోరారు. తనకు ఉన్న సమస్య కారణంగా అలా టాయిలెట్ లో గడుపుతున్నానని... దానిని ఇలా లెక్కించి కోత విధించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తాను వృధా చేసిన సమయం కన్నా ఎక్కువగా లెక్కించిందని వాపోయారు. మనిషి కనీస అవసరాలు తీర్చుకుంటూ పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని... బాగా పని చేస్తారని అన్నారు. ఇలా టాయిలెట్ కు వెళ్లకుండా పని చేయడం అంటే ఎలా సాధ్యమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించారు.
Tags:    

Similar News