ఓ 15 ఏళ్ల బాలిక ఎవరితోనో ఎఫైర్ పెట్టుకొని గర్భం దాల్చింది. ఈ అక్రమ వ్యవహారంలో ఆ బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్ ఆ పిండాన్ని తనతోపాటు కారులో తీసుకెళ్తూ దారి మధ్యలో కారులోంచి చెత్త కుప్పలోకి విసిరేశాడు. ఈ దారుణం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.
అహ్మదాబాద్ కు చెందిన 15 ఏళ్ల బాలికను లొంగదీసుకున్న 19 ఏళ్ల సునీల్ సర్గ అనే యువకుడు ఆమెపై అత్యాచారం చేసి కడుపు చేశాడు. ఈ వ్యవహారాన్ని గుట్టుగా రట్టు చేయాలని మణినగర్ ప్రాంతంలోని డాక్టర్ షా ను సంప్రదించారు.
డాక్టర్ షా జూలై 6న రూ.15వేలు తీసుకొని బాలికకు అక్రమంగా గర్భస్రావం చేసి పిండాన్ని తనతోపాటు కారులో ఇంటికి తీసుకెళ్తుండగా చెత్తలో పిండాన్ని రహస్యంగా విసిరేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్రమంగా అబార్షన్ చేసిన డాక్టర్ ను అదుపులోకి తీసుకొని.. బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై అత్యాచారంతోపాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.