లాలూ ప్రసాద్ ‌కు క‌రోనా టెన్షన్ !

Update: 2020-04-28 14:17 GMT
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్... ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో జైలు జీవితం గడుపుతున్నారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో రాంచీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ‌కు ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణంగా లాలూకు చికిత్స అందించే డాక్టర్‌ ట్రీట్‌మెంట్ అందించిన మరో రోగికి కరోనా రావడమే.

లాలూ ప్రసాద్ యాదవ్ ‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ వైద్యం అందించిన ఓ రోగికి కరోనా వచ్చినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో డాక్టర్ ఉమేశ్ ప్రసాద్‌తో పాటు ఆయన టీమ్ ‌లోని మరికొందరిని క్వారంటైన్‌ కు తరలించారు. వీరిలో ఎవ‌రికైనా క‌రోనా పాజిటివ్ అని తేలితే, లాలూ ప్రసాద్ యాదవ్ ‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే లాలూను పెరోల్ పై విడుద‌ల చేసే ప్ర‌తిపాద‌న‌ను జార్ఖండ్ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌కు సీఎం హేమంత్ సోరెన్ పంపించారు. కాగా 7 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ జైలు శిక్ష ఉన్న ఖైదీల‌ను మాత్ర‌మే పెరోల్‌పై విడుద‌ల చేయాల‌ని సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News