భువీని మళ్లీ ఐపీఎల్లోనా చూసేది..! అతడికి ఏమైంది?

Update: 2020-12-25 13:30 GMT
టీం ఇండియా ఫేస్​బౌలర్​ భువనేశ్వర్​ ప్రస్తుతం తీవ్ర గాయంతో బాధపడుతున్నాడు. అతడు మరో ఆరునెలల వరకు ఆడలేకపోవచ్చని వైద్యులు అంటున్నారు. దీంతో క్రికెట్​ అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. దుబాయ్​లో జరిగిన గత ఐపీఎల్​లో భువీ తొడకండరాలకు గాయమైంది. దీంతో అతడు మరో ఆరునెలలపాటు ఆడకపోవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే టీం ఇండియాను గత కొంతకాలంగా గాయాల బెడద వెంటాడుతున్నది.

2019 ప్రపంచకప్‌ టైంలో ఓపెనర్ శిఖర్ ధావన్, విజయ్ శంకర్, గాయపడగా.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాకు గాయాలయ్యాయి. వీరంతా చాలాకాలం జట్టుకు దూరమయ్యారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయపడి కోలుకున్నారు. ఐపీఎల్ 2020 సమయంలో భువనేశ్వర్ గాయపడ్డాడు. ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ కూడా గాయపడ్డారు. ఇషాంత్, రోహిత్ కోలుకుంటున్నా.. భువీకి మాత్రం తగ్గలేదు. అయితే తాజాగా అతడికి మరోసారి ఫిట్​నెస్​ పరీక్షలు చేయగా.. మరో ఆరునెలలపాటు అతడు ఆటకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. అయితే ఇంగ్లాండ్​ సిరీస్​కు కూడా భువనేశ్వర్​ దూరంగా ఉండనున్నారు. అతడు మళ్లీ ఐపీఎల్​లో ఆడే అవకాశం ఉంది.

అయితే ఆస్ట్రేలియా టూర్​లో ఫాస్ట్​బౌలర్​ షమీ గాయపడ్డాడు. అతడు ఆరువారాల పాటు క్రికెట్​కు దూరమయ్యాడు. షమీ కూడా ఇంగ్లాండ్​ టూర్​లో ఆడటం కష్టమే. భువనేశ్వర్​, షమీ లాంటి ఫేసర్లు లేకుండా ఇంగ్లాండ్​ను ఎదుర్కోవడం సాహసమేనని క్రికెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. తొడ కండరాలకి గాయమవగా.. మొదట నడిచేందుకు అతడు ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత ఫిజియో సాయంతో మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. రెండో బంతి వేసే క్రమంలో రనప్ పూర్తి కాకుండానే గాయం తీవ్రత కారణంగా వికెట్ల వద్దకి వచ్చి ఆగిపోయాడు. అలా భువనేశ్వర్​ తీవ్రంగా గాయపడ్డాడు.
Tags:    

Similar News