కరోనా మహమ్మారిని నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ఫ్లాస్మా చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్రినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా, ఢిల్లీలో తొలి ప్లాస్మా థెరపీ విజయం నమోదైంది. 49 ఏళ్ల కరోనా బాధితుడు ఫ్లాస్మా ట్రీట్ మెంట్ ద్వారా పూర్తిగా కోలుకున్నట్లు ఢిల్లీ మ్యాక్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఏప్రిల్ 4న 49 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరగా, అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. కొద్దిరోజుల్లోనే అతని ఆరోగ్యం క్షీణించి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే డాక్టర్లు అతడికి ప్లాస్మా థెరపీ ని అందించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాతో అతడికి చికిత్స చేశారు. ఊహించని రీతిలో ఈ చికిత్స మంచి ఫలితాన్ని ఇచ్చింది. దీనితో అతడికి అమర్చిన వెంటిలేటర్ ను తొలగించారు. ఆ తరువాత రెండుసార్లు నిర్వహించిన కోవిడ్ పరీక్షలోనూ నెగిటివ్ అని తేలింది. అతను పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఈ ఫ్లాస్మా చికిత్స కరోనాను నివారించే మ్యాజిక్ ఫార్ములా కాదని , ఫ్లాస్మా థెరపీ ద్వారానే అతను కోలుకున్నాడు అని పూర్తిగా చెప్పలేం అని మ్యాక్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ బుధిరాజు తెలిపారు. ఎందుకంటే ఇతర ప్రోటోకాల్స్ ని కూడా మేం ఫాలో అయ్యాం. ఫ్లాస్మా క్రినికల్ ట్రయల్స్ తో మన దేశం ఒక అడుగు ముందుకేసింందని భావిస్తున్నా, కరోనా సోకిన వ్యక్తి నుంచి సేకరించిన ఫ్లాస్మాలో యాంటీబాడీస్ అత్యధికంగా ఉంటాయి. దీన్ని ఇతర కరోనా రోగులకు అందిచడం ద్వారా ఆ వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువ అని అయన తెలిపారు. అలాగే , ఒక దాత 400 ఎంఎల్ ఫ్లాస్మాను దానం చేయగలడని, దీని ద్వారా ఇద్దరి ప్రాణాలను కాపాడవచ్చు అని డాక్టర్ బుధిరాజు తెలిపారు.