ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అందరి అంచనాలకు భిన్నంగా పంజాబ్ లోని 117 స్థానాలకు 92 స్థానాల్లో చీపురు పార్టీ పాగా వేసింది. ఎవరూ అంచనా వేయలేని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
సీట్ల సాధనలో మిగిలిన పార్టీలకు ఏ మాత్రం అందనంత దూరాన నిలబడి.. తనకు తప్పించి మరెవరికీ సాధ్యం కాని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ తాజా గెలుపుతో పంజాబ్ కు ఆ పార్టీ విస్తరించినట్లైంది.
దీంతో కొత్త వాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఒకప్పుడు దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న హస్తం పార్టీ ఈ రోజున రెండంటే రెండురాష్ట్రాలకే పరిమితమైతే.. ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీకి సమానంగా రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని రన్ చేసే పరిస్థితికి రావటంతో.. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ అవుతుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
అయితే.. కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీని పోల్చటం అతిశయోక్తిగానే చెప్పాలి. వ్యవస్థాగతంగా పార్టీకి ఉన్న లోపాలు.. నాయకత్వ సమస్య.. సైద్దాంతిక అంశాల్లో కాలానికి తగ్గట్లుగా మారకపోవటం.. తప్పుల మీద తప్పులు చేయటం లాంటివి కాంగ్రెస్ కు శాపాలుగా మారాయని చెప్పాలి. అదే సమయంలో పంజాబ్ ప్రజల్లో తన మీద నమ్మకాన్ని.. భరోసాను కల్పించటంలో అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
తాజా విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా మారే అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పాలి. జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు తగ్గట్లుగా ఆ పార్టీ ఇప్పుడు ఉందన్న మాట వినిపిస్తోంది.
రాబోయే రోజుల్లో హర్యానా రాష్ట్రంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న సంప్రదాయ పార్టీలకు భిన్నంగా.. సిద్ధాంతాల్ని మాటల్లోనే కాదు.. చేతల్లో చూపిస్తున్న వైనం ప్రజలకు కొత్త ఆశల్ని రేకెత్తించేలా చేస్తుందని చెప్పాలి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పాలనా తీరును పలువురు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.
ఢిల్లీ రాష్ట్రానికి అప్పు అన్నది లేకుండా చేసిన ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. ఇవాల్టి రోజున ఎంత కుదిరితే అంత అప్పును తీసుకొచ్చేసి.. ప్రజల మీద రుద్దేస్తున్న ప్రభుత్వాలకు భిన్నంగా ఉన్న అప్పులన్ని తీర్చేసి రుణ రహిత రాష్ట్రంగా మార్చటం లాంటివి క్రేజీవాల్ కు.. ఆయన పార్టీకి కొత్త ఇమేజ్ ను తీసుకొస్తున్నాయి.
ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా మారాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారంగా కనీసం మూడు రాష్ట్రాల్లో కనీసం 2 శాతం లోక్ సభ సీట్లు సాధించాల్సి ఉంటుంది. లేదంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ కానీ.. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఆరు శాతం ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నాలుగు లోక్ సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండాలి. ఈ నిబంధనలకు తగ్గట్లు ఉంటే ఆ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తారు.
నిబంధనల ప్రకారం చూస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు రాష్ట్రాల్లో ఢిల్లీ.. పంజాబ్.. గోవాలలో ఆరు శాతం ఓట్లను సాధించింది. అలాగే మూడు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంది. నాలుగు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆప్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 156 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరో రాష్ట్రం కూడా ఆప్ పార్టీలో చేరితే జాతీయ పార్టీగా మారటం ఖాయం.
రానున్న హర్యానా ఎన్నికలతో అది కూడా పూర్తి అవుతుందని చెప్పాలి. ఇదంతా చూస్తున్నప్పుడు.. తనను తాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ఆమ్ ఆద్మీ పార్టీలో కలిసిపోతే బాగుండన్న మాట వినిపించటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు.. ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా మారిందన్న భావన కలిగేలా చేస్తుందని చెప్పక తప్పదు.