చాలామందే కనిపిస్తారు. తమ ప్రయోజనాలు తీరిన తర్వాత ఆయన్ను దెబ్బ తీసి ఉదంతాలు బోలెడన్ని కనిపిస్తాయి. ఉన్న వాళ్లను వదులుకోని తత్త్వమే ఆయన లోపంగా పలువురు చెబుతారు. అధినేత అన్న నేత కఠినంగా.. కటువుగా ఉండాలంటారు. కేసీఆర్ ఎలాఅయితే.. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారో.. ఎంత పెద్ద నేత అయినా అణిగిమణికి ఉండాలే కానీ.. తోక జాడిస్తే.. శంకరగిరి మాన్యాలన్నట్లుగా బాబు తీరు ఉండదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాబునోటి వెంట ఫస్ట్రేషన్ మాటలు వస్తుంటాయి. తాజాగా అలాంటి మాటలే మళ్లీ వచ్చాయి. తాజాగా పార్టీ నేతలతో సమావేశమైన సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాసింత ఘాటుగానే రియాక్టు అయ్యారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన దౌర్జన్యాలు తిరుపతి ఉప ఎన్నికల్లోనూ చేద్దామంటే కుదరదు. ఒకవేళ అలాంటి ఆకృత్యాలు చేయాలని వైసీపీ నేతలు వచ్చినా, వాటిని సమష్టిగా ఎదుర్కొని తాడో పేడో తేల్చుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యంగా నియోజకవర్గ నాయకుల మధ్య సమన్వయం ఉండాలి. ఇదివరకటిలా వ్యవహిరించి ఇష్టమొచ్చినట్టు పార్టీకి నష్టం కలిగేలా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అలాంటివారు పార్టీనుంచి వెళ్లిపోవడమే మేలు. లేకుంటే నేనే సస్పెండ్ చేయాల్సి వస్తుంది. టీడీపీలో బలమైన కార్యకర్తలకు కొదవలేదు. కొత్తవారిని నాయకులుగా తయారు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.
అయితే.. ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో చంద్రబాబు నోటి నుంచి రావటం విన్నదే. ఏ సందర్భంలోనూ ఫలానా నేత ఇలా చేశారని కానీ.. వీరి మీద వేటు వేసామన్న నిర్ణయాన్ని ప్రకటించటం చూసి ఉండం. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైతే పాత పద్దతిని వదిలేసి.. కాసింత కఠినంగా వ్యవహరించాలని తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు మాటలు చెప్పారు..బాస్ ఇప్పుడు చేతల్లో చూపించాల్సిన సమయం వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది. పార్టీకి కంచుకోటగా ఉండే తిరుపతిలో ఒక్క కార్పొరేటర్ గెలిచారని చెప్పుకోవటం అవమానకరంగా ఉందని చెప్పిన చంద్రబాబు.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకొని.. కొత్తవారికి పగ్గాలు అప్పగిస్తే.. మార్పు వస్తుంది కదా. మాటల్లో కనిపించే కఠినం.. చేతల్లో చూపించేది ఎప్పుడు చంద్రబాబు?