క‌రోనా టెస్ట్ చేయ‌బోతున్న కుక్క‌..! రిజ‌ల్ట్ ప‌క్కా.. ఎలా చేస్తుందో తెలుసా..?

Update: 2021-03-03 13:30 GMT
మొన్న‌టి వ‌ర‌కూ మ‌న దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ టెస్టుల ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలిసిందే. క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ఎంత మంద‌కొడిగా సాగాయో అంద‌రూ చూశారు. ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికే క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని, ఒక‌సారి చేసిన వారికి మ‌ళ్లీ చేయ‌డం లేద‌ని ఇలా రూల్స్ పెట్టాల్సి వ‌చ్చింది. స‌రైన ఎక్విప్ మెంట్, ల్యాబ్ లు లేక‌పోవ‌డంతోపాటు కిట్ల కొనుగోలు ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం కావ‌డంతో ఈ ప‌రిస్థితి త‌ప్ప‌లేదు. అయితే.. ఇవేవీ లేకుండా మ‌నిషికి క‌రోనా ఉందో లేదో ఓ కుక్క తేల్చ‌బోతోంది! ఈ మేర‌కు శాస్త్ర‌వేత్తలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

స్విట్జర్లాండ్ లోని జెనీవా యూనివర్శిటీ హాస్పిటల్స్ (HUG) పరిశోధకులు ఈ మేర‌కు ప‌రిశోధ‌న‌లు మొద‌లు పెట్టారు. ఇందుకోసం వారు స్నిఫ్ఫ‌ర్ డాగ్స్ ను సెల‌క్ట్ చేసుకున్నారు. మూడు కుక్కల‌ను ఈ రీసెర్చ్ కోసం ఎంచుకున్న సైంటిస్టులు.. నాలుగు వారాలపాటు వాటికి శిక్షణ ఇచ్చే కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టారు. ఈ మేర‌కు HUG యాజ‌మాన్యం ఆన్‌లైన్ లో వెల్ల‌డించింది.

స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద విశ్వవిద్యాలయం HUG. ఈ ఆసుప‌త్రి వైద్య బృందంతోపాటు స్విస్ ఆర్మీ, ఐక్యరాజ్యసమితి డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సహకారంతో ఈ అధ్యయనం మొద‌లైంది. మార్చి చివ‌రి నాటికి తుది ఫలితాన్ని అందుకోగ‌ల‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.

ఇంత‌కీ.. ఈ ప‌రిశోధ‌ ఎలా చేస్తున్నారంటే.. ఆరోగ్యవంతులు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప‌లువురిని ఈ ప‌రీక్ష‌కు ఎంచుకుంటారు. వారి న‌మూనాల‌ను సేక‌రించి, ఈ మూడు కుక్కలకు వాస‌న ద్వారా ఎలా గుర్తు ప‌ట్టాలో ట్రైనింగ్ ఇవ్వ‌బోతున్నారు. అంటే.. పోలీస్ డాగ్స్ కు ఇచ్చిన శిక్ష‌ణ మాదిరిగా అనుకోవ‌చ్చు.

ఈ శిక్షణ పొందిన స్నిఫర్ కుక్కలు COVID-19 ఇన్ఫెక్షన్ ఉన్నవారిని చెమ‌ట వాస‌న ద్వారా గుర్తిస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కాగా.. వాస‌న ద్వారా స్నిఫ‌ర్ డాగ్స్ క‌రోనా బాధితుల‌ను గుర్తించ‌గ‌ల‌వ‌ని ఇప్ప‌టికే.. ఫ్రాన్స్, జర్మనీ త‌దిత‌ర దేశాల మొద‌టిద‌శ‌ ఫలితాలు చూపించాయి. ఇప్పుడు స్విస్ లో జ‌రిగే రీసెర్చ్ పూర్తిస్థాయిలో ఫ‌లితాల‌ను ఇవ్వ‌బోతోంది.  

ఇది స‌క్సెస్ అయితే.. COVID-19 స్క్రీనింగ్ చేయ‌బోతున్న కుక్క‌ల‌ను మొద‌ట‌గా స్విట్జ‌ర్లాండ్ లో మ‌నం చూడొచ్చు. దీనివ‌ల్ల ఖ‌ర్చు లేకుండా ప‌రీక్ష‌లు పూర్తిచేసి, ఫ‌లితాలు చెప్పేయొచ్చు.  మ‌రి, ఏం జ‌రుగుతుంది? ప‌రిశోధ‌న ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుంది అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News