మామూలుగా ఉంటే ఏం బాగుంటుంది. రోటీన్ కు భిన్నంగా ఉండటాన్ని చాలా మంది ఇష్టపడతారు. కానీ.. ఒక ఊరు ఊరంతా కలిసి ఇలా రోటీన్ కు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేయటం విశేషంగా చెప్పక తప్పదు. పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో చాపల్యం అన్న రీతిలో.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక గ్రామానికి చెందిన వారు చేసిన కుక్కల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరి చూపు వారి మీద పడేలా చేసింది.
యూపీకి చెందిన ప్రయాగ్ రాజ్ లోని మహున్లీ గ్రామానికి చెందిన వారంతా కలిసి ఒక ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ ఊరికి చెందిన రెండు కుక్కలకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు. అనుకోవటం అంటే అనుకోవటం అన్నట్లు కాకుండా మామూలు పెళ్లికి ఏ మాత్రం తగ్గని రీతిలో కుక్కల పెళ్లి చేశారు.
ఇందుకోసం ఊరంతా చందాలు వేసుకున్నారు. ఆ మొత్తంతో కుక్కల్ని అందంగా ముస్తాబు చేశారు. అంతేనా.. వాటి పెళ్లిని భారీగా.. వేడుకగా చేశారు. మేళతాళాలతో ఊరేగింపు చేశారు. పెళ్లిలో భాగంగా భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 500 మంది అతిధులు హాజరు కావటమే కాదు.. విందు భోజనాల్ని ఏర్పాటు చేశారు. ఏమైనా సగటు జీవి చేసుకోనంత భారీగా.. ఘనంగా కుక్కల పెళ్లి జరిగిందని చెప్పక తప్పదు.