అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందరితో సున్నం పెట్టుకుంటున్నారు. లేని పోని వివాదాలు రాజేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన ప్రచార పర్వంలో అందరిపై విమర్శలు చేస్తున్నారు. అడ్డువచ్చిన వారిపై నిప్పులు చెరుగుతున్నారు.
ఇప్పటికే కరోనా వైరస్ ప్రబలడానికి కారణమైన చైనాపై నిప్పులు చెరుగుతున్న ట్రంప్.. ఇక తన ప్రత్యర్థి, అమెరికా అధ్యక్ష డెమోక్రటిక్ అభ్యర్థి అయిన జోబిడెన్ ను గెలిపించడానికి చైనా కుట్ర పన్నుతోందని తాజాగా సంచలన విమర్శలు చేశారు.
ఇప్పుడు తాజాగా ట్విట్టర్ మీద ట్రంప్ పడ్డారు. ట్రంప్ కు, ట్విట్టర్ మధ్య తాజాగా వార్ నడుస్తోంది. ట్రంప్ చేసిన మెయిల్-ఇన్-బ్యాలెట్లను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ పై ట్వీట్టర్ అభ్యంతరం తెలుపుతూ ట్రంప్ ను ట్యాగ్ చేసింది.
దీంతో తననే ట్యాగ్ చేసి అవమానిస్తారా? చెక్ చేసుకోవాలని సూచిస్తారా అని ట్రంప్ ట్విట్టర్ పై నిప్పులు చెరిగారు. సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ వార్తలను నమ్మి, తనను ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచిస్తారా అంటూ ప్రశ్నించారు.
చైనా మాదిరిగానే ట్విట్టర్ కూడా 2020 అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందని.. ప్రత్యర్థులను గెలిపించేందుకు కుట్ర పన్నుతోందని ట్రంప్ విమర్శించాడు. దీనికి ట్విట్టర్ కూడా ధీటుగా స్పందించడంతో ట్విట్టర్, ట్రంప్ వార్ పీక్ స్టేజీకి చేరింది.